ఎంత తిడితే… అంత పెద్దోడ్ని అవుతా..!

Pawan Kalyan fires on TDP“తాను ఎంత ఎక్కువగా తిడితే, అంత పెద్ద నాయకుడినియా అవుతానని” భావిస్తున్నారో ఏమో గానీ, మైక్ కనపడితే చాలు తిట్ల పురాణంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అండ్ కోపై విరుచుకుపడుతున్నారు జనసేన అధినేత. తానొక పార్టీకి అధ్యక్షుడని అన్న విషయం మరిచిపోయి, గల్లీ లీడర్ల కంటే అధ్వానమైన భాషను వినియోగిస్తూ… తనపై ఉన్న గౌరవభావాన్ని నానాటికి తగ్గించుకోవడంలో పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో విజయవంతం అవుతున్నారు.

[m9ad]

ADVERTISEMENT

ముఖ్యమంత్రి చంద్రబాబు చూపించే రెండు వేళ్ళ సింబల్ ను ఉద్దేశిస్తూ…. మీవి విడిపోయిన రెండు వేళ్ళు, మావి అయిదు వేళ్ళు బిగించిన పిడికిలి… మీ పద్ధతి మార్చుకోండి, బెదిరింపులు మానండి, లేదంటే దెబ్బకు దెబ్బ తీస్తాం పిచ్చికుక్కల్లారా” అంటూ సంభోదించి, తన స్థాయి ఏమిటో ప్రజలను అర్ధం చేసుకోవాల్సిందిగా పవన్ కళ్యాణ్ విన్నవించుకున్నారు. గడిచిన మూడు, నాలుగు రోజులుగా పవన్ వాడుతోన్న భాషకు నిదర్శనం ఈ డైలాగ్.

గత నాలుగేళ్ళుగా చంద్రబాబుని ఇదే స్థాయిలో దూషణలు చేయడంలో జగన్ ‘నెంబర్ 1’గా నిలిచారు. అయితే ఇపుడు ఆ స్థానాన్ని తాను కబ్జా చేయాలనుకుంటున్నట్లుగా పవన్ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. ఒక వీధి రౌడీ మాదిరి మాట్లాడుతోన్న ఇలాంటి వ్యాఖ్యలే పవన్ గొప్ప సిద్దాంతాలుగా ప్రచారం చేసుకోవడం శోచనీయం. రాష్ట్రంలో ఉన్న ఇద్దరు ప్రతిపక్ష నేతలు ఇలా జుగుప్సాకరంగా మాట్లాడుతోన్నా… మరోవైపు ముఖ్యమంత్రి వర్యులు మాత్రం ‘టంగ్ క్లిప్’కు ఆస్కారం లేకుండా మాట్లాడుతున్నారు.

ADVERTISEMENT
Latest Stories