బిగ్ ఇష్యూ… రాత్రికి రాత్రే క్లోజ్..?

Pawan Kalyan - JanaSena -YS jagan - YSRCPజనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ అధినేత జగన్ చేసిన విమర్శలు సాధారణమైనవి కావు. పవన్ సీరియస్ గా తీసుకుంటే… ఏపీ రాజకీయాలను మరో మలుపు తిప్పే ఆరోపణలు. గత కొన్ని నెలలుగా తమను టార్గెట్ చేస్తున్నా, టిడిపి నేతలు కూడా ఎప్పుడూ ఈ స్థాయిలో పవన్ పై విమర్శలు చేసింది లేదు. మరి అంత సంచలనం అయినప్పటికీ, మీడియా వర్గాలు వీటిని విస్మరించడం ఊహించినది కాదు.

[m9adh]

ADVERTISEMENT

ముఖ్యంగా జగన్ మీడియా అయితే పవన్ పై విమర్శలకు ప్రాధాన్యత ఇవ్వలేదు, ప్రింట్ మీడియా అయితే ఏదో మొక్కుబడిగా ప్రచురించింది. మరోవైపు పవన్ ఖాతాలో కొత్తగా చేరిన మీడియా ఛానల్ కూడా చిన్న, చితక నేతలతో ఫోన్ సంప్రదింపులు జరిపి పవన్ ను ఒక దేవుడులా కీర్తించే ప్రయత్నం చేసింది తప్ప, ఈ ఆరోపణల నుండి లబ్ది పొందే ప్రక్రియ మాత్రం చేయలేదు.

ఇక అన్నింటికన్నా ముఖ్యమైన అంశం ఏమిటంటే… కత్తి మహేష్, శ్రీరెడ్డి లాంటి సాధారణ లాంటి వారిని కూడా సెలబ్రిటీగా మార్చేసిన ఓ మీడియా సంస్థ, ఇంత పెద్ద విషయంపై కనీసం చర్చ చేపట్టకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటన్న దానిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పొలిటికల్ వర్గాల్లో సంచలనంగా నిలిచిన జగన్ వ్యాఖ్యలు… చివరికి టీ కప్పులో తుఫాన్ మాదిరి మారడం వెనుక ఉన్న “మర్మం” ఏమిటో?!

ADVERTISEMENT
Latest Stories