అంత రిస్క్ తీసుకోవాలంటే అది పవన్ కళ్యాణ్ సినిమా అయ్యుండాలి

Pawan Kalyan - Director Krishపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా పవన్ కళ్యాణ్ కేరీర్ లో మొట్టమొదటి పీరియడ్ సినిమా. ఈ సినిమా ఓవర్సీస్ డీల్ పూర్తి అయ్యింది. ఫార్స్ ఫిల్మ్స్ పదిహేను కోట్లకు ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ ని క్లోజ్ చేసిందని సమాచారం.

ఇప్పటికే నిర్మాతకు రెండు కోట్లు అడ్వాన్స్ ఇచ్చినట్టు సమాచారం. సినిమా టైటిల్ గానీ ఫస్ట్ లుక్ గానీ విడుదల కాకముందే డీల్ క్లోజ్ కావడం విశేషం. మరీ ముఖ్యంగా ఓవర్సీస్ లో ఇప్పటికీ కరోనా పరిస్థితులు చక్కబడలేదు. తెలుగు సినిమాకు ఇంపార్టెంట్ మార్కెటైన అమెరికా లో అయితే పరిస్థితి ఘోరంగా ఉందని.

ADVERTISEMENT

ఇటువంటి సమయంలో అడ్వాన్స్ ఇవ్వడం సాహసమే. అప్పటికి పరిస్థితి చక్కబడి సాధారణ పరిస్థితికి వస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర సునామీ ఖాయం. అయితే 2022 సంక్రాంతికి మహేష్ బాబు సర్కారు వారి పాట కూడా విడుదల కానుంది. మహేష్ ఓవర్సీస్ లో చాలా స్ట్రాంగ్ అయినప్పటికీ ఈ సినిమా మీద ఇంత పెట్టడం పవన్ కళ్యాణ్ మీద నమ్మకం తోనే.

సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, విడుదల తేదీ మహా శివరాత్రి సందర్భంగా వస్తాయని నిర్మాతలు ప్రకటించారు. ఎ.ఎం.రత్నం ప్రొడక్షన్ నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవణి సంగీతం కంపోజ్ చేస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా ఉంది ఈ సినిమాలో.

ADVERTISEMENT
Latest Stories