మొదటి రోజే పవన్ కళ్యాణ్ రెండు పడవల ప్రయాణం మీద హింట్ ఇచ్చేశారా?

Pawan Kalyanపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెరంగేట్రం కంఫర్మ్ అయిపోయినట్టే. బాలీవుడ్ సినిమా, పింక్ రీమేక్ లో ఆయన నటిస్తున్నట్టు గతకొంత కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి అయితే పవన్ కళ్యాణ్ దానిని ఇప్పటివరకూ ధృవీకరించలేదు. అయితే ఈ రోజు సినిమా ముహూర్తం సైలెంట్ గా జరిగిపోయినట్టు సమాచారం.

దిల్ రాజు ఆఫిసులో దర్శకుడు, ఇతర సాంకేతిక నిపుణులతో ఆ కార్యక్రమం పూర్తి చేశారట. జనవరి నుండి సినిమా షూటింగ్ మొదలు అవుతుంది, పవన్ కళ్యాణ్ ఫిబ్రవరి నుండి జాయిన్ అయ్యి, సింగల్ షెడ్యూల్ లో సినిమాలో తన భాగం పూర్తి చేస్తారు. హిందీలో తాప్సి కనిపించిన పాత్రలో నివేత థామస్ కనిపించబోతుందని తెలుస్తుంది.

ADVERTISEMENT

దీనికి వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహిస్తాడు. ఇంతకీ ఈ పింక్ సినిమా కాన్సెప్ట్ ఏంటంటే.. ముగ్గురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు, ఓ లాయర్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ఇది. ఆ ముగ్గురు అబ్బాయిల్లో ఒకరు ఓ అమ్మాయిపై అత్యాచారం చేయాలని చూస్తాడు. ఆమె తప్పించుకునే క్రమంలో బీర్ బాటిల్‌తో అతని తల పగలగొడుతుంది. అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. ఈ కేసును మొదటి నుంచి డీల్ చేస్తున్న లాయర్ (అమితాబ్ బచ్చన్) ఎలా నెగ్గారు అన్నదే కథ.

పవన్ కళ్యాణ్ వయసు, ఇమేజ్ ని బట్టి కథలో మార్పులు చేర్పులు చేస్తున్నారట. సినిమా లాంచ్ జరుగుతున్న సమయంలో కూడా పవన్ కళ్యాణ్ రాజకీయాలలోనే బిజీగా ఉన్నారు. ఈరోజు ఆయన కాకినాడలో జనసేన రైతు సౌభాగ్య దీక్ష పేరుతో దీక్షకు కూర్చున్నారు. దీనితో ఆయన రెండు పడవల ప్రయాణం చెయ్యబోతున్నట్టు అర్ధం అవుతుంది.

ADVERTISEMENT
Latest Stories