‘అన్నయ్య’ను పక్కన పెట్టి ‘కన్నయ్య’లా పవన్!

pawan kalyan on sardaar sets with kajal chiranjeeviమెగాస్టార్ చిరంజీవి ఇటీవల పవన్ కళ్యాణ్ “సర్దార్ గబ్బర్ సింగ్” సినిమా సెట్ కు వెళ్ళిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పవన్ – చిరులు కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేసాయి. తాజాగా హీరోయిన్ కాజల్ తో పవర్ స్టార్ దిగిన కొత్త స్టిల్స్ కూడా సందడి చేస్తున్నాయి.

ఈ రెండు ఫోటోలను పక్కన పెడుతూ నెటిజన్లు సరికొత్త చర్చకు దారితీసారు. చిరంజీవి వచ్చినపుడు ‘అన్నయ్య’కు కాస్త దూరంగా ఉన్న పవన్, మరో వైపు కాజల్ పై చేయి వేస్తూ ‘కన్నయ్య’ (చిలిపి కృష్ణుడు)లా వ్యవహరించారని పోలుస్తున్నారు. అన్నదమ్ముల మధ్య అంతరానికి నిదర్శనంగా ఈ ఫోటోలను ప్రస్తావిస్తున్నారు.

ADVERTISEMENT

అయితే చిరు, కాజల్ లపై పవన్ అభిమతం ఎలా ఉన్నా, పవర్ స్టార్ కు సంబంధించిన ప్రతి అంశం నెటిజన్లకు ఆసక్తికరమే కదా! అందుకే చిన్న చిన్న అంశాలు కూడా భారీ స్థాయిలో సందడి చేస్తుంటాయి..!

ADVERTISEMENT
Latest Stories