పవన్ అభిమానులారా… కాస్త చెప్పింది వినండి..!

pawan kalyan request to his fansఅభిమానాన్ని చాటుకోవడంలో పవర్ స్టార్ ఫ్యాన్స్ ది కాస్త భిన్నమైన శైలి. పవన్ సినిమా గురించి ఏదైనా ఒక విషయం బయటకు రాగానే… దానిని తమ ఆలోచనల్లో ఏ విధంగా ఉంటుందో చేసి చూపించి సోషల్ మీడియాలో ఎప్పుడూ సందడి వాతావరణం సృష్టిస్తుంటారు. ఇలా తనపై చూపిస్తున్న అభిమానానికి పవన్ పొంగిపోయిన సందర్భాలు కోకొల్లలు. అలాంటి అభిమానులు ఇబ్బందులు పాలు కాకుండా ఉండడానికి పవర్ స్టార్ ఒక విజ్ఞప్తి చేసారు.

“హైదరాబాద్, నోవాటెల్ హోటల్ లో నిర్వహించబోతున్న ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ ఆడియో వేడుకకు కేవలం పాస్ లు ఉన్న వారు మాత్రమే రావాలని, భద్రతా కారణాల రీత్యా అదనపు బలగాలను హోటల్ వద్ద మొహరించారని, ఇక్కడి వరకు వచ్చి అభిమానులు ఇబ్బందులు పాలు కావడం ఇష్టం లేకనే ఈ సమాచారాన్ని తెలుపుతున్నట్లుగా” పవన్ ఒకరోజు ముందే సదరు విషయాన్నంతా చెప్పుకొచ్చారు.

ADVERTISEMENT

ముందుగా బహిరంగ ప్రదేశంలో ఈ వేడుక నిర్వహించాలని ఉన్నప్పటికీ, సెక్యూరిటీ కారణాల రీత్యా కుదరదని చెప్పడంతో నోవాటెల్ హోటల్ ను ఎంచుకున్నామని, అయితే ఈ హోటల్ లో విదేశీయులు కూడా ఎక్కువ మంది బస చేస్తుండడంతో… ఏదైనా అవాంచనీయ సంఘటనలు ఉత్పన్నమైతే… అది ఒక ఇంటర్నేషనల్ ఇష్యూగా మారిపోతుందని పోలీస్ వర్గాలు పలు సూచనలు చేసారని, ఈ సమాచారం తెలియక అభిమానులు వేడుక ప్రాంగణాన్ని వీక్షించాలని హోటల్ వద్దకు వస్తే తీవ్ర భంగపాటుకు గురయ్యే అవకాశం ఉంది కనుకనే ఫ్యాన్స్ కు ఈ విజ్ఞప్తి చేసినట్లుగా తెలుస్తోంది.

తమను గురించి ఇంతలా ఆలోచిస్తున్న పవర్ స్టార్ అభిమానానికి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇలాంటి రియల్ హీరోను తమ గుండెల్లో తప్ప మరెక్కడ ఉంటారంటూ… పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. మరి పవన్ చేసిన విజ్ఞప్తికి అభిమానులు ఏ విధంగా స్పందిస్తారో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.

ADVERTISEMENT
Latest Stories