‘సర్ధార్’ను డిజాస్టర్ గా ‘డిక్లేర్’ చేసేసారా..!

pawan kalyan-Sardaar-gabbar-Singh-disasterభారీ అంచనాల నడుమ విడుదలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “సర్ధార్ గబ్బర్ సింగ్” సినిమాకు ప్రేక్షకుల నుంచి ఆశించిన స్పందన లభించకపోవడం తెలిసిన విషయమే. అయితే పవన్ సత్తాకు నిదర్శనంగా తొలిరోజు కలెక్షన్స్ నిలిచాయన్నది ట్రేడ్ పండితుల అంచనా. కృష్ణా, వైజాగ్, ఉభయ గోదావరి జిల్లాల వంటి కొన్ని ఏరియాలలో ‘బాహుబలి’ రికార్డులను సైతం బద్దలు కొట్టిన ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ ఓవరాల్ గా ఆల్ టైం జాబితాలో ‘బాహుబలి’ తర్వాత స్థానమైన టాప్ 2లో నిలిచిందని తెలుస్తోంది.

ADVERTISEMENT

స్థానిక మార్కెట్ తో పాటు యుఎస్ లోనూ ‘సర్ధార్’ సత్తా చాటడంతో ప్రీమియర్ షోల కలెక్షన్స్ కూడా ‘శ్రీమంతుడు’ను దాటి రెండవ స్థానానికి చేరుకున్నాయి. టాక్ పరిస్థితి ఎలా ఉన్నా, కలెక్షన్స్ వరకు పవర్ స్టార్ అభిమానులు ఆశించిన రీతిలోనే అందుకోవడంతో అభిమానులు ఉత్సాహంగానే ఉన్నారు. అయితే ‘బాహుబలి మాదిరి నేషనల్ వైడ్ ఖ్యాతి గడించాలన్న ఆశ మాత్రం తీరని వాంఛగానే మిగిలిపోయిందని ట్రేడ్ వర్గాలు ధృవీకరించాయి.

దాదాపు 800 ధియేటర్లలో విడుదలైన హిందీ ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ అర కోటి కలెక్షన్స్ ను కూడా కైవసం చేసుకోకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. సినిమా విడుదలకు ముందు పలు జాతీయ మీడియా వర్గాలకు స్వయంగా పవన్ రంగంలోకి దిగి మరీ ఇంటర్వ్యూలు ఇచ్చినా… ఫలితం పూర్తి నిరాశజనకంగా రావడంతో పాటు కనీస కలెక్షన్స్ కూడా వసూలు చేయకపోవడం విశేషం. దీంతో హిందీ ‘సర్ధార్’ డిజాస్టర్ అన్న విషయం ఖరారైపోయింది.

ADVERTISEMENT
Latest Stories