స్థాయి దిగజార్చుకుంటోన్న పవన్!

Pawan Kalyan speech in Denduluruరెచ్చగొట్టడం… ఉద్వేగభరితుల్ని చేయాలని ప్రయత్నించడం… సెంటిమెంట్ తో పడగొట్టడం… దీనికి గానూ జుగుప్సాకరమైన భాషనూ వినియోగించడం… వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రజా సభలలో నిత్యం పాటించే అంశాలు. ‘ఇది అంతం కాదు ఆరంభం… కాసుకోండి సిఎం గారు…’ అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా జగన్ రూట్ నే ఎంచుకున్నారన్న విషయం దెందులూరు పర్యటన సందర్భంగా స్పష్టమవుతోన్న విషయం.

ADVERTISEMENT

[m9ad]

సినిమాలకు తాను దూరమయ్యాననే బాధలో ఉన్నారో, ఏమో గానీ, తాజా బహిరంగ సభలో తన మార్క్ సినీ డైలాగ్ లతో అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేసారు పవన్. ఇక్కడితో ఆగిపోయినట్లయితే విమర్శలకు పెద్దగా తావిచ్చేది కాదు గానీ, మరీ జుగుప్సాకరమైన భాషను వినియోగించి తన స్థాయిని తానే దిగజార్చుకున్నారు ‘జనసేన’ అధినేత. ‘ఎవరు ఎవరితో పడుకుంటే పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలంట’ అంటూ తనదైన ఎటకారపు నవ్వులు నవ్వుతూ చెప్పడం, పవన్ గమ్యం ఎటు వైపుకు వెళ్తుందో అన్న విమర్శలకు తావిచ్చింది.

బహుశా తనలోని చిన్నపిల్లాడి మనస్తత్వం ఇంకా పోయినట్లు లేదేమో గానీ, పరిపక్వత గల రాజకీయ నాయకుడి లక్షణాలు, ముఖ్యంగా ఒక రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి స్థాయి మచ్చుకైనా కనిపించకపోవడం విశేషం. ఇలాంటి వ్యాఖ్యలు ఆయా సభలలో ఉన్న అభిమానులను ఉత్సాహపరుస్తాయేమో గానీ, ప్రజలను జనసేన అధినేత వైపుకు ఆకర్షితులను మాత్రం చేయలేవని గుర్తించి వ్యాఖ్యలు చేస్తే కనీస గౌరవభావం అయినా లభిస్తుంది. ఇలాంటి వ్యాఖ్యలతోనే ప్రజలలో జగన్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన వైనం పవన్ కు తెలియనిది కాదు.

ADVERTISEMENT
Latest Stories