అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కాపులను మభ్యపెడుతున్నారా?

Pawan Kalyan stand on Kapu Reservationజనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకే విషయం గురించి రెండు చోట్ల మాట్లాడితే అవి పరస్పర విరుద్ధంగా కూడా ఉంటాయి ఒక్కోసారి. కాపుల రేజర్వేషన్ల విషయంలో ఆయన చేస్తున్నది అదే అనిపించక మానదు. మొన్న ఆ మధ్య ఒక సభలో మాట్లాడుతూ 2014 ఎన్నికల ముందు కూడా చంద్రబాబుతో కాపుల రిజర్వషన్ అంశం గురించి ప్రస్తావించారట.

ADVERTISEMENT

[m9ad]

ఇదెలా సాధ్యమవుతుందని చంద్రబాబును పవన్ అడిగారట. అయినా చంద్రబాబు సాధ్యమే అని చెప్పి ఆయనను మభ్య పుచ్చారట.నాలుగేళ్ల తర్వాత పవన్ కు ఈ విషయం గుర్తుకు వచ్చింది. సరే పవన్ కళ్యాణ్ అన్నట్టు చంద్రబాబు చేసింది మోసమే అనుకుందాం. మరి ఇప్పుడు అదే వాగ్దానం పవన్ కళ్యాణ్ చేస్తున్నారు కదా

ఇటీవలే ఆ పార్టీ విడుదల చేసిన జనసేన విజన్ డాక్యుమెంట్ ఆంధ్రప్రదేశ్ లో 9వ షెడ్యూల్ లో చేర్చడం ద్వారా కాపులకు రేజర్వేషన్లు అని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ విషయంలో చంద్రబాబు పరిస్థితి ఏంటో పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా అంతే. ఇద్దరు కేంద్రం మీద ఆధారపడాల్సిందే. మరి పవన్ ఆరోపిస్తునట్టుగా చంద్రబాబు కాపులను మభ్యపెడితే పవన్ కళ్యాణ్ కూడా అదే చేస్తున్నట్టుగా.

ADVERTISEMENT
Latest Stories