
కోలీవుడ్ హీరో విజయ్ టీవీకే పార్టీతో తొలి ప్రయత్నంలోనే తమిళనాడు శాసనసభ ఎన్నికలలో 108 సీట్లు గెలుచుకోగానే ఆంధ్రప్రదేశ్‌లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలామందికి టార్గెట్ కావడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
కానీ నీళ్ళలో మునిగిపోతున్నవాడికే ఆ బాధ, భయం అర్ధమవుతాయి… ఒడ్డున కూర్చున్నవాడికి కాదు. రాజకీయాలలో కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది.
మొన్న విజయ్‌తో పోల్చి పవన్ కళ్యాణ్‌ని వేలెత్తి చూపి విమర్శించినవారే ఇప్పుడు విజయ్ అయోమయ పరిస్థితి చూసిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ ఆలోచనలు, నిర్ణయాలు, విధానాలు తప్పనగలరా?
చిరంజీవి చాలా ఆచితూచి మాట్లాడుతారు.. అడుగు ముందుకు వేస్తారని అందరికీ తెలుసు. కానీ పవన్ కళ్యాణ్ ఆవేశపరుడు, చాలా దూకుడుగా వ్యవహరిస్తుంటారు.
అయన ప్రజారాజ్యం ఎత్తేసిన తర్వాత పవన్ కళ్యాణ్ జనసేనతో రాజకీయాలలోకి ప్రవేశించడం చాలా రాంగ్ డెసిషన్, రాంగ్ టైమింగ్ అని వాదించినవారున్నారు.
పవన్ కళ్యాణ్ రాజకీయాలలో ప్రవేశించి ఎన్నికలలో పోటీ చేయకుండా కూటమికి మద్దతు ఇవ్వడాన్ని తప్పు పట్టినవారు కోకొల్లలు.
ముఖ్యంగా టీడీపితో పొత్తు విషయంలో తీవ్ర అభ్యంతరాలు వినిపించాయి. ఆ కారణంగా ఆయన టీడీపికి దూరమైనప్పుడు రెండు పార్టీలు నష్టపోయాయి. కలిసినప్పుడు రెండు పార్టీలు లాభపడ్డాయి.
ఈ విషయం గ్రహిస్తే పవన్ కళ్యాణ్‌ని విజయ్‌తో పోల్చి చూసేవారే కాదు. కానీ అభిమానులకి, మద్దతుదారులకి రాజకీయాలు అనవసరం. వారికి తమ అభిమాన హీరో అందరి కంటే ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటారు. సహజమే! దానికి అభిమానం తప్ప మరే రీజనింగ్, కొలమానం ఉండదు. అందుకే గత రెండు రోజులుగా పవన్ కళ్యాణ్‌పై ఇన్ని విమర్శలు వినిపించాయి.
అవి ఆయన అభిమానులలో నెలకొన్న అసంతృప్తి, అసహనానికి నిదర్శనంగా భావించవచ్చు. లేదా సందట్లో సడేమియా అన్నట్లు ఈ వంకతో పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేస్తూ కూటమి ప్రభుత్వంలో, ముఖ్యంగా జనసేనలో చిచ్చుపెట్టే ప్రయత్నాలు కూడా కావచ్చు.
కానీ పవన్ కళ్యాణ్ ఆలోచనలు, నిర్ణయాలు, పట్టువిడుపులే ఆయనతో సహా ఆ పార్టీని నేడు ఇంత ఉన్నత స్థితిలో నిలిపాయనే విషయం గ్రహించడం చాలా అవసరం.
ఆవేశపరుడైన పవన్ కళ్యాణ్ ఇంత లోతుగా ఆలోచించి ఆచితూచి అడుగులు వేస్తుండటం మెతకవైఖరి కానే కాదు. రాజకీయాలలో రాణించేవారికి ఉండాల్సిన మొదటి లక్షణం. ఆయన డెప్యూటీ సిఎం పదవి చేపట్టడమే కాకుండా పార్టీలో పలువురిని మంత్రులు, ఎమ్మెల్యేలుగా కొత్త గుర్తింపు ఇచ్చారు. అలాగే జనసేన పార్టీని కూడా ప్రజలు గుర్తించి, ఆమోదించే స్థాయికి తీసుకువెళ్ళారు కదా? కానీ ఇలాంటి విషయాలు గుర్తించే బదులు, విజయ్‌తో పోల్చుకొని దూకుడుగా వెళ్ళి బోర్లాపడాలని కోరుకోవడం వివేకం అనిపించుకుంటుందా?
Following the commercial success of Psycho in 2020, director Mysskin completed the shooting for his…
Drishyam: The Conclusion has been a big box-office success. Trade experts can't predict exactly where…