చిన్న హీరోయిన్ తో సరిపెట్టుకోనున్న పవన్ కళ్యాణ్?

Pawan Kalyan -Niddhi Aggerwal జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండేళ్ళ గ్యాప్ తరువాత తిరిగి సినిమాల్లోకి ఎంటర్ అవుతున్న సంగతి తెలిసిందే. ఆయన తన కమ్ బ్యాక్ ఫిలిం, పింక్ రీమేక్ షూటింగ్ ఇటీవలే మొదలు పెట్టారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మరో సినిమా ఈ మధ్యనే సెట్స్ మీదకు వెళ్ళింది.

ఇది ఒక పీరియడ్ సినిమా అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఒక పీరియడ్ సినిమా చెయ్యడం ఇదే మొదటి సారి. కోహినూర్ డైమండ్ నేపథ్యంలో ఈ కథ ఉండబోతుందట… షాజహాన్ కొలువులో నుండి ఆ వజ్రాన్ని దొంగిలించే ప్రయత్నం చేసే దొంగల ముఠా నాయకుడిగా పవన్ కళ్యాణ్ కనిపించబోతున్నారని వార్తలు వస్తున్నాయి.

ADVERTISEMENT

ఇది ఇలా ఉండగా ఈ సినిమా కోసం సోనాక్షి సిన్హా, పూజా హెగ్డే వంటి పెద్ద పెద్ద పేర్లు వినపడ్డాయి. అయితే తాజాగా ఒక చిన్న హీరోయిన్ తో పవన్ కళ్యాణ్ సరిపెట్టుకునట్టు సమాచారం. ఇస్మార్ట్ శంకర్ తో హిట్ కొట్టిన నిధి అగర్వాల్ ని ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా ఫైనల్ చేశారట. ఇంకో హీరోయిన్ గా కూడా చిన్న హీరోయినే ఉండే అవకాశం ఉందంటున్నారు.

ఈ సినిమాకు కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ అంటున్నారు. పవన్ కళ్యాణ్ తో సినిమా చెయ్యడం ఆయనకు ఇదే మొదటి సారి. సీనియర్ నిర్మాత ఏఎం రత్నం ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మొదట్లో 2021 సంక్రాంతికి విడుదల చెయ్యాలని అనుకున్నా ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సంక్రాంతికి రానుండడంతో ఏం చెయ్యబోతున్నారు అనేది చూడాలి.

ADVERTISEMENT
Latest Stories