తమిళనాడు పార్టీపై పవన్‌కి అంత ప్రేమెందుకో?

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ తెలంగాణలో జనసేన పార్టీ లేదా ఆ రాష్ట్రంలో బిఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల గురించి ఏదైనా మాట్లాడితే ఎవరూ పెద్దగా ఆశ్చర్యపోరు. కానీ తమిళనాడులోని ప్రధాన ప్రతిపక్షపార్టీ అన్నాడీఎంకె పార్టీపై ట్విట్టర్‌లో ఇంగ్లీషు, తమిళ భాషల్లో ప్రశంశలు కురిపించడమే చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది.

నేడు ఆ పార్టీ 53వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పవన్‌ కళ్యాణ్‌ ఆ పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ ఎంజీఆర్, ఆయన తర్వాత ఆ పార్టీని, రాష్ట్రాన్ని నడిపించిన దివంగత ముఖ్యమంత్రి జయలలితని ప్రశంశిస్తూ పవన్‌ కళ్యాణ్‌ ట్వీట్‌ చేశారు. వారిరువురూ అంటే తనకు చాలా అభిమానమంటూ చాలా రాశారు. స్వర్గీయ ఎంజీఆర్, జయలలితల ఫోటోలను పోస్ట్ చేస్తూ ఆ పార్టీ నేతలకి పవన్‌ కళ్యాణ్‌ అభినందనలు తెలియజేశారు.

ADVERTISEMENT

పవన్‌ కళ్యాణ్‌కి హటాత్తుగా తమిళనాడులో ఓ రాజకీయ పార్టీపై ఎందుకు ప్రేమ పుట్టుకొచ్చింది? అని ఎవరికైనా సందేహం కలగడం సహజం. అలాగే నటుడు ప్రకాష్ రాజ్‌కి కూడా కలిగింది. దానికి మళ్ళీ ఆయనే సమాధానం చెప్పారు. బహుశః బీజేపీ అధిష్టానం ఆదేశం మేరకు పవన్‌ కళ్యాణ్‌ అన్నాడీఎంకే పార్టీకి మద్దతుగా మాట్లాడుతున్నారేమో?అని అన్నారు.

జయలలిత మరణించిన తర్వాత తమిళనాడులో బీజేపీ అడుగుపెట్టేందుకు ప్రయత్నించింది. ఆ ప్రయత్నంలో రజినీ కాంత్ సాయం అర్ధించింది. కానీ ఆయన ముందుకు రాలేదు. ఆ తర్వాత అన్నాడీఎంకే పార్టీని జయలలిత స్నేహితురాలు శశికళ హస్తగతం చేసుకొని రాష్ట్ర రాజకీయాలలో చక్రం తిప్పాలనుకున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఆమెను నాలుగేళ్ళపాటు జైలుకి పంపించి, ఆలోగా పన్నీర్ సెల్వం, పళని స్వామి వంటి నేతలను, వారితో పాటు అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని, పార్టీని తమ చెప్పు చేతలలోకి తెచ్చుకొని రాష్ట్ర రాజకీయాలని పరోక్షంగా శాశించడం మొదలుపెట్టింది.

కానీ తమిళనాడు శాసనసభ ఎన్నికలలో డీఎంకే పార్టీ విజయం సాధించి అధికారంలోకి రావడంతో బీజేపీ అధిష్టానం ప్రయత్నాలు ఫలించలేదు. కనుక ఈసారి పవన్‌ కళ్యాణ్‌ని తమిళనాడు రాజకీయాలపై సందించబోతున్నట్లు ఆయన వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. వచ్చే ఎన్నికలలో అన్నాడీఎంకే పార్టీకి, దాని మిత్రపక్షంగా ఉన్న బీజేపీకి పవన్‌ కళ్యాణ్‌ అండగా నిలబడబోతున్నారని భావించవచ్చు.

పవన్‌ కళ్యాణ్‌ తన సినిమాలని పణంగా పెట్టి ఏపీ రాజకీయాలలో ఇంతగా నిలద్రొక్కుకున్న తర్వాత ఇప్పుడు తమిళనాడు రాజకీయాలలో వేలు పెట్టడం అవసరమా?దాని వలన బీజేపీ లాభపడితే పడవచ్చు కానీ పవన్‌ కళ్యాణ్‌, జనసేన పార్టీలకు ఎంతో కొంత నష్టమే తప్ప ఏం లాభం?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Netflix Under Fire: Why Pay for YouTube-Level Content?

Kamiya Jani has been a popular face on social media for her way of interacting…

21 minutes ago

Mass H-1B Layoffs at Fortinet?

A Reddit post has gone viral for claiming that the cybersecurity firm Fortinet has laid…

3 hours ago