
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ‘జనసేన’ అధినేత తనపై చేస్తున్న ప్రచారంపై స్పందించారు ఈ కేంద్రమంత్రి. పవన్ విమర్శలను అసలు మేం పరిగణనలోనికి తీసుకోవడం లేదని చాలా లైట్ గా తీసుకున్న వెంకయ్య నాయుడు, గత ఎన్నికలలో ప్రచారం చేసిన మాట వాస్తవం, దానికి సంతోషకరం. అయితే 2019 ఎన్నికలలో పోటీ చేస్తానని స్పష్టంగా చెప్పేశారు గనుక, వారు ఒక లైన్ తీసుకుని ముందుకెళ్తున్నారు, వెళ్ళనివ్వండి. వ్యక్తిగత విమర్శలకు నేను సమాధానం చెప్పను. నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద విద్వేషాలు లేవు. కాంగ్రెస్ మాదిరే ఒక రాజకీయ పార్టీగా వారు కూడా ఒక అభిప్రాయంతో కొనసాగుతున్నారు గనుక, రాజకీయాల్లో ఇలాంటి విమర్శలు సహజమే అన్నట్లుగా వ్యాఖ్యలు చేసారు.
పవన్ కళ్యాణ్ ను తామేమీ వాడుకుని వదిలేయలేదే, వదిలేసింది మేం కాదు, పవన్ కళ్యాణే అన్ని అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు వెంకయ్య. ‘ప్రత్యేక హోదా’ గురించి అందరితో చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నామని, అయితే వ్యక్తిగతంగా పవన్ తో చర్చలు జరిపే బాధ్యత తనది కాదు, తానూ ఒక కేంద్రమంత్రిని, అది కూడా రాజస్తాన్ తరపున ఉన్న ఎంపీని, మరో వైపు పార్టీ పని, ప్రభుత్వం పని… అవన్నీ ఉండి కూడా రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సవరించాలని నా ప్రయత్నం నేను చేస్తున్నా… నా స్థానంలో మరొకరు ఉంటే నేను ఇంకా బాగా చేసుండేవాడిని అనుకుంటే అది వాళ్ళ అభిప్రాయమని, దానికి తానేమీ చేయగలిగింది లేదు అన్నట్లుగా ‘జనసేన’ అధినేతపై ఒక విస్పష్టమైన జవాబిచ్చారు.
అయితే వెంకయ్య మాదిరే పవన్ కూడా తానూ వ్యక్తిగతంగా ఎవరినీ టార్గెట్ చేయను, తన పోరాటం ఎప్పుడూ సిద్ధాంతాల మీదనే అంటూ చెప్తూ ఉన్న విషయం తెలిసిందే. మరి అంతగా చెప్పే పవన్ కళ్యాణ్, ఒక్క వెంకయ్య నాయుడునే ఎందుకు వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారన్నది మాత్రం అంతుపట్టని విషయం. ఎన్నో కేసులు, వేల కోట్ల కుంభకోణాల ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ అధినేతపైన కూడా ఒక్క చిన్న విమర్శ చేయని ‘జనసేన’ అధినేతకు, ఈ కేంద్రమంత్రితో ఎక్కడా చెడిందా అన్న రీతిలో పొలిటికల్ వర్గాలు ఆలోచనలు చేస్తున్నాయి. అయితే ఎవరేమనుకున్నా తానూ చేయగలిగినంతా తానూ రాష్ట్రానికి చేస్తున్నానని వెంకయ్య నాయుడు ఈ సందర్భంగా కూడా కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.
Kalvakuntla Kavitha had an emotional exit from the BRS party as she was sent out…
Varun Dhawan’s films have not worked big at the box office over the last few…