పవన్ వీరభక్తుడిగా బండ్ల గణేష్ పేరు అందరికీ తెలిసిందే. ఎంత భక్తుడికైనా రాజకీయాల దగ్గరికి వచ్చేపాటికి వేదాంతం గుర్తుకు వస్తుందని బండ్ల నిరూపిస్తూ… ‘సినిమాలు వేరు, రాజకీయ వేరు’ అంటూ తన మనసులోని మాటను తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మరోసారి స్పష్టం చేసారు. ఎప్పటికీ తాను ‘భక్త ఆఫ్ పవన్ కళ్యాణే’ అని, ఇందులో ఎలాంటి సందేహానికి తావు లేదని ఈ సందర్భంగా మరోసారి స్పష్టం చేసారు.
[m9ad]
కాంగ్రెస్ ను విభేదించిన పవన్ కళ్యాణ్ తో సినిమాలు నిర్మిస్తారా? అని మీడియా ప్రతినిధి వేసిన ప్రశ్నకు…. ‘నిస్సందేహంగా’ అంటూ బదులిచ్చారు బండ్ల. అందులో మీకు ఎలాంటి అనుమానం అవసరం లేదు, ఖచ్చితంగా తాను పవన్ కళ్యాణ్ తో మరొక సినిమా చేస్తానంటూ చెప్పుకొచ్చారు. ఇది పవన్ కళ్యాణ్ పై తనకున్న నమ్మకమా? లేక పరోక్షంగా జనసేన ఓటమి గురించి బండ్ల గణేష్ చెప్పుకోచ్చారా? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి.
గత ఏడాది కాలంగా ఎంతో సమయం ఉన్నప్పటికీ మరో సినిమా అంగీకరించకుండా పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి దిగిన పవన్, ఇప్పట్లో సినిమాలు చేసే అవకాశం లేదని స్పష్టం చేసారు. అలాగే ప్రచారంలో కూడా తనకు అధికారం కట్టబెట్టండి అంటూ పిలుపునిస్తున్నారు. ఒకవేళ పవన్ నిజంగా సినిమాలు చేయాలి అంటే, వచ్చే ఎన్నికలలో జనసేన దారుణ పరాజయాన్ని చవిచూడాల్సి ఉంది. బహుశా అదే విషయాన్ని బండ్ల గణేష్ ఇలా చెప్పుకొచ్చారేమో?!



