
మోస్ట్ ఎవైటెడ్ పెద్ది ట్రైలర్ రిలీజైంది. రామ్ చరణ్ ట్రాన్స్ఫర్మేషన్ బాగుంది, క్రికెటర్ గా, కుస్తీ ఆటగాడిగా, రన్నర్ గా చరణ్ తనను తాను మార్చుకున్న విధానం, తెరపై సదరు స్పోర్ట్స్ ను పండించిన తీరు ఆకట్టుకుంది. రెహమాన్ బీజీయం ఆశించిన స్థాయిలో ఎగ్జైట్ చేయకపోయినా.. పర్వాలేదనిపించుకుంది.
అయితే.. సినిమా జోనర్ తో సింక్ లేకుండా ఇబ్బందిపెట్టిన ఏకైక అంశం జాన్వీ కపూర్ పాత్ర. ఆమె పరువాలను తెరపై పరిచిన విధానం కానీ, ఆమెతో చెప్పించిన ముతక మాటలు కానీ ఎందుకో ట్రైలర్ కంటెంట్ కి సెట్ అవ్వలేదు. ఏదో మాస్ మసాలా క్యారెక్టర్ లా ఉంది కానీ, హీరోయిన్ అని మాత్రం అనిపించలేదు.
అందులోనూ.. చరణ్ “పెద్ది” చిత్రాన్ని “దంగల్, సుల్తాన్” వంటి సినిమాలతో పోల్చాడు. ఆ సినిమాల్లో హీరోయిన్ పాత్రలు చాలా హుందాగా ఉంటాయి. సుల్తాన్ లో అయితే అనుష్క శర్మ పాత్ర ఆల్మోస్ట్ సెకండ్ హీరోలా ఉంటుంది. ఇక దంగల్ లో అమ్మాయిల పాత్రలు ఎంతో హృద్యంగా ఉంటాయి. కానీ.. బుచ్చి మాత్రం “పెద్ది”లో జాన్వీ కపూర్ క్యారెక్టర్ ని చాలా నాటుగా చూపించాడు. ఎంత పల్లెటూరు భామ అయినప్పటికీ.. ఈస్థాయిలో మొరటుగా చూపించాలా? ఒకపక్క హీరో ఏమో తన ప్రజల కోసం, తన ఊరి కోసం పోరాడి ఆడుతున్నట్లుగా చూపిస్తుంటే.. హీరోయిన్ మాత్రం పైటను పట్టించుకోకుండా.. ఊరంతా తిరుగుతున్నట్లుగా చూపించడం అనేది ఎందుకో వర్కవుట్ అవ్వలేదు.
అయితే.. బుచ్చి సినిమాలో జాన్వీ పాత్రకి ఎలా చూపించాడు? ఆ పాత్ర ద్వారా కథకు ఎలాంటి ఉపయోగం ఉండబోతోంది? అనేది తెలియాలంటే మాత్రం జూన్ 3 రాత్రి వరకు వెయిట్ చేయాల్సిందే.
Indian Prime Minister Narendra Modi is the longest serving prime minister in the history of…
Sobhita Dhulipala has opened up about why she left home for Mumbai at just 16,…