పెనివిటి… పోస్టర్ బాగుంది..!

Peniviti-Aravindha-Sametha-Posterత్రివిక్రమ్ – తారక్ ల “అరవింద సమేత” సినిమా ప్రమోషన్స్ శరవేగంగా సాగుతున్నాయి. ధియేటిరికల్ ట్రైలర్, వీడియో సాంగ్ ప్రోమో, మేకింగ్ వీడియో…. ఇలా ఒక దాని వెంట మరొకటి అభిమానులను పలకరిస్తుండగా, తాజాగా మరో వీడియో సాంగ్ ప్రోమో కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీనికి సంబంధించి చిత్ర యూనిట్ ఓ పోస్టర్ ను రిలీజ్ చేస్తూ స్పష్టం చేసింది.

‘అరవింద సమేత’ ఆల్బమ్ లో హైలైట్ సాంగ్ గా నిలిచిన ‘పెనివిటి’ సాంగ్ యొక్క వీడియో ప్రోమో శనివారం నాడు సాయంత్రం 450 గంటలకు యూ ట్యూబ్ లో ప్రత్యక్షం కానుంది. దీనికి సంబంధించి విడుదల చేసిన పోస్టర్ కన్నులవిందుగా ఉంది. లైటింగ్స్ లో మెరుస్తూ ఉన్న ఇంటి ముందు జూనియర్ ఎన్టీఆర్ నిల్చున్న పోస్టర్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

ADVERTISEMENT

[m9adh]

ADVERTISEMENT
Latest Stories