వంచన గురించి మీరే చెప్పాలి…!

టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక వాలంటీర్లను తొలగించేస్తారు అంటూ వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారానికి తెలుగు సంవత్సరాదినాడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎండ్ కార్డు వేశారు.

మేము అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతలు చెపుతున్నట్టుగా వాలంటీర్లను తొలగించబోము సరికదా వారికీ అదనంగా మరో 5 వేలు పెంచి వారి గౌరవేతనాన్ని10 వేలు చేస్తాం, ఎవ్వరు వైకాపా నేతల మాటలను నమ్మి మోసపోవద్దు అంటూ వాలంటీర్లకు హామీ ఇచ్చారు.

ADVERTISEMENT

ఇక దీనిని కూడా తమకు అనుకులంగా ఎలా మలచుకోవాలా అని ఆలోచించిన వైసీపీ ఇక తదుపరి కార్యచరణకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా వైసీపీ తన సోషల్ మీడియాలో జగన్ మోహన్ రెడ్డి సృష్టించిన వాలంటీర్ వ్యవస్థ ఎంత గొప్పదో తెలుసుకున్న బాబు, పవన్, మోడీలకు ధన్యవాదాలు అంటూ ఒక పోస్ట్ పెట్టింది.

అయితే ఇందులో వైసీపీ నాయకులు తెలుసుకోవలసిందేమిటంటే ఏ వ్యవస్థనైనా ఏర్పాటు చేయడం గొప్ప కాదు దానిని ప్రజాస్వామ్య యుతంగా ఆచరణలోకి తీసుకు రావడం ముఖ్యం. గత ప్రభుత్వాల ఆనవాళ్లు, గుర్తింపు లేకుండా చేయడానికి రాష్ట్ర రాజధానికి సైతం సమాధి కట్టిన వైసీపీ రాజకీయాలకు వాలంటీర్లు బలి కాకూడదు అనే ఉద్దేశంతో చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం కచ్చితంగా వైసీపీకి ఎదురుదెబ్బ కానుంది.

కాబట్టే దానికి తమ మాటల గారడితో మందు పూయడానికి మాజీ మంత్రి పేర్నినాని మీడియా ముందుకు వచ్చారు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు చేసే వాగ్దానాలను నమ్మే పరిస్థితి లేదు, నయవంచనకు మారు పేరు బాబు. అధికారం వచ్చే వరకే ఈ హామీల మీద కట్టుబడతాడు, ఒక్కసారి అధికారం చేతికి రాగానే తన బుద్ధి చూపిస్తాడు, వాలంటీర్లు బాబు మాటలను విశ్వసించవద్దు అంటూ వైసీపీ మనోగతాన్ని వివరించారు.

పేర్నినాని వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రోలింగ్ నడుస్తుంది. నయవంచన గురించి మీరే చెప్పాలి…మేమె వినాలి మరి..! అంటూ జనసైనికులు, వంచన గురించి మాట్లాడే కనీస నైతికత వైసీపీ కి ఉందా అంటూ టీడీపీ శ్రేణులు వైసీపీ గత చరిత్రను తవ్వి తీస్తున్నారు. 2019 ఎన్నికలకు ముందు నేను అధికారంలోకి వస్తే రాజధానిని మార్చేస్తాను అంటూ టీడీపీ చేస్తున్న ప్రచారాన్ని ఎవ్వరు నమ్మవద్దు, నా ఇల్లు ఇక్కడే రాజధాని ఇక్కడే అంటూ జగన్ ఇచ్చిన హామీ ఎటుపోయిందో..?

వివేకా హత్యలో టీడీపీ హస్తం ఉంది అంటూ రాసిన కథనాల సాక్ష్యాలు ఎక్కడ..? మెడలు వంచి తెస్తానన్న ప్రత్యేక హోదా ఎక్కడ..? తన రాజకీయ అవసరానికి అడ్డుపెట్టుకున్న చెల్లి షర్మిల రాజకీయ జీవితం ఎటుపోయింది..? బాబాయ్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న అవినాష్ రెడ్డి రాజకీయ జీవితాన్ని కాపాడుతున్నదెవరు..? అదికారంలోకి వచ్చిన వారంలో చేపిస్తానన్న సీపీఎస్ రద్దు ఏ అటకెక్కింది..? సంపూర్ణ మద్యపాన నిషేధం హామీ ఏ బెల్టు షాపుల ముందు బంది అయ్యింది..?

ఈ హామీలన్నీ అమలు చేయకుండా అటకెక్కించి నమ్మి ఓటేసిన ప్రజలకు జగన్ చేసిందేమిటి..? నయవంచన కాదా..? లేక అంతకంటే ఎక్కువా..? చెప్పండి మాజీ మంత్రి గారు అంటూ టీడీపీ, జనసేన సోషల్ మీడియాలు నాని వ్యాఖ్యల పై గగ్గోలు పెడుతున్నాయి. మీరు ఒక వేలు మా వైపు చూపిస్తే మిగిలిన నాలుగు వేళ్ళు మీ వైపు చూపించేంత అసమర్థ పాలన చేసిన మీరు వంచనలు, నయవంచనలు అంటూ పెద్దపెద్ద పదాలు మాట్లాడకపోవడం మంచి అంటూ హితవు పలుకుతున్నారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Recent Posts

Daily Hearing At CBI Court, But Can Jagan Stay Out?

It has been more than dedicate since the CBI and the enforcement directorate have failed,…

3 minutes ago

వివేకా హత్య కేసులో సీబీఐ కంటే ఈడీ స్పీడ్‌!

“వివేకా హత్య కేసుతో నాకు ఎటువంటి సంబంధమూ లేదు. ఆ ఆరోపణలతో నేను చాలా ఆవేదన అనుభవిస్తున్నాను. నేను ఏ…

8 minutes ago