
వైసీపీ రాజకీయ సిద్ధాంతం ప్రకారం ఆ పార్టీకి సంబంధించిన ఏ నాయకుడు బహిరంగంగా ప్రత్యర్థి నాయకులను బూతులు తిడతారో, ఏ నాయకుడు నడిరోడ్డు మీద తన ఆవేశంతో వీరంగం సృష్టిస్తారో, తన వ్యాఖ్యలతో సమాజాన్ని భయపెట్టాలని చూస్తారో, తన చర్యలతో అధికారులను బెదిరించాలని భావిస్తారో వారికే పెద్ద పీట లభిస్తుంది.
అందుకు గతంలో బాబు ఇంటి మీదకు దాడికి వెళ్లిన జోగికి దక్కిన మంత్రి పదవి, పవన్ పై అనుచిత వ్యాఖ్యలతో రెచ్చిపోయిన పోసాని వచ్చిన అవకాశం, తాజాగా సీఎం బాబు పై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలకు గాను ఆయనకు వైసీపీ లో పెరిగిన గౌరవం – గుర్తింపు ప్రత్యక్ష సాక్ష్యులుగా నిలుస్తున్నాయి.
ముఖ్యమంత్రి చంద్రబాబు పై నడిరోడ్డు మీద పోలీస్ అధికారుల సాక్షిగా మీడియా ముందు వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు బూతులతో రెచ్చిపోయారు. దాని ఫలితంగా టీడీపీ శ్రేణుల నుంచి తీవ్ర పరిణామాలను ఎదుర్కొన్నారు, కేసులతో అరెస్టయ్యి జైల్లో గడిపారు.
అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో పార్టీ అధినేతగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేత చర్యలను తప్పుపట్టాల్సిన వైస్ జగన్ వాటిని సమర్థిస్తూ అంబటి రాంబాబుని వైసీపీ కాపు టైగర్ అంటూ కీర్తించారు. అలాగే ఆ ఘటనను రెండు కులాల మధ్య వివాదంగా మలిచేందుకు కాపు రాజకీయం మొదలుపెట్టారు.
అంబటి ఇంటికి వైసీపీ కాపు నేతల పరామర్శలు, బాబు కాపు ద్రోహి అంటూ ప్రకటనలు, అటు పై తగ్గేదెలా అంటూ అంబటి ప్రెస్ మీట్లు..ఇలా మొత్తానికి ఒక వివాదం నుంచి ఒక వైసీపీ కాపు నాయకుడిని సృష్టించాలని, అతనిని రాష్ట్ర కాపు సామాజికవర్గ బ్రాండ్ అంబాసిడర్ గా మార్చాలని తన రాజకీయంతో వైసీపీ విశ్వప్రయత్నం చేసింది.
ఇక దీనినే వైసీపీ లో మరో మాజీ మంత్రి పేర్ని నాని, ఆయన తనయుడు పేర్ని కిట్టు ఆదర్శంగా తీసుకున్నారో ఏమో కానీ బందరు వీధులలో పోలీస్ ఉన్నతాధికారుల పై హద్దులు దాటి విమర్శలకు దిగారు. 2029 లో వైసీపీ అధికారంలోకి వచ్చాక మీ సంగతి చూస్తా అంటూ మీడియా సాక్షిగా నడిరోడ్డు మీద బెదిరింపులకు పాల్పడ్డారు.
తన ఈ చర్యలతో ప్రభుత్వం తన పై కేసులు పెట్టాలని, పెడుతుందని, తద్వారా అరెస్టయ్యి జైలుకు వెళితే పార్టీలో తన ప్రాబల్యం పెరుగుతుందని, పార్టీ అధినేత జగన్ వద్ద తన గుర్తింపు రెట్టింపు అవుతుందని, ఇదంతా తన కుమారుడి రాజకీయ భవిష్యత్ కి పునాదిగా మారుతుందని ఆశించారో ఏమో కానీ నాని అవసరం లేని చోట కూడా అధికంగా ఆవేశ పడ్డారు.
మరి పేర్ని ఈ అత్యావేశం అధినేత జగన్ ను మెప్పిస్తుందా.? ప్రభుత్వాన్ని నొప్పిస్తుందా.? ఈ వివాదం అరెస్టుల వరకు సాగుతుందా.? దానితో తనకు కూడా వైసీపీ కాపు నాయకుడిగా జగన్ దగ్గర మంచి గుర్తింపు లభిస్తుందా.? చివరిగా అంబటి రాంబాబు మాదిరి తన పై మీడియా అటెన్షన్, వైసీపీ కాపు నేతల మద్దతు దక్కుతుందా.?
Vijay Deverakonda’s Ranabaali is heading towards release with a big overseas target, but the early…
After missing its October 9 release, Venkatesh and Trivikram’s Aadarsha Kutumbam AK47 was reportedly heading…