వరుస సినిమాలు వైఫల్యం కావడం…. విడుదల కావాల్సిన “2.0” వాయిదాలు పడడంతో…. డీలాపడిన సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులకు “పేట్టా” సినిమా ఒక ఆశాదీపంలా కనపడుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ అండ్ టీజర్ అభిమానులను మెప్పించే విధంగా ఉండగా, తాజాగా సెకండ్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్.
రజనీ ‘అరుణాచలం’ మాదిరి పంచె, లుంగీ కాస్ట్యూమ్స్ తో, ‘సింగం’ తరహా మీసంతో తన మాస్ ప్రేక్షకులను మెప్పించే విధంగా సూపర్ స్టార్ దర్శనమిస్తున్నారు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
ADVERTISEMENT
[m9adh]
ADVERTISEMENT



