Telugu

తెలంగాణలో మళ్ళీ ఫోన్ ట్యాపింగ్‌.. ఈసారి బాధితులు బీఆర్ఎస్‌ నేతలట!

తెలంగాణలో మళ్ళీ ఫోన్ ట్యాపింగ్‌ ఆరోపణలు మొదలయ్యాయి. ఈసారి కాంగ్రెస్‌ ప్రభుత్వం బీఆర్ఎస్‌ పార్టీ నేతల ఫోన్లు, వారి ఇళ్ళ ముందున్న సీసీ కెమెరాలు హ్యాక్ చేయిస్తోందట!

ఆ పార్టీ సీనియర్ నేత హరీష్‌ రావు నేడు మీడియాతో మాట్లాడుతూ, “కొంత మంది ఐపీఎస్ అధికారులు బెంగళూరు నుంచి ‘హ్యాకర్స్’ని రప్పించి మా ఫోన్లు, సీసీ కెమెరాలు హ్యాక్ చేయిస్తూ మా కదలికలు, వ్యవహారాలపై నిఘా పెట్టారని మా దగ్గర పక్కా సాక్ష్యాధారాలున్నాయి. మేము అధికారంలోకి వచ్చాక ఎవరినీ విడిచిపెట్టబోము, అప్పటికి రిటైర్ అయినా విడిచిపెట్టే ప్రసక్తి లేదు. కనుక ఇలాంటి పనులు మానుకోవాలి,”“ అని హరీష్‌ రావు హెచ్చరించారు.

ADVERTISEMENT

‘ఫోన్ ట్యాపింగ్’ అంటే మొట్ట మొదట గుర్తుకు వచ్చే పేరు కేసీఆర్‌. మొట్ట మొదట ఆయన హయంలోనే ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిపై జరిగింది. ఆ తర్వాత ముగ్గురు జాతీయ స్థాయి బిజేపి ప్రముఖులపై జరిగింది. ఫోన్ ట్యాపింగ్ ద్వారానే రెండు కేసులలో వారిని ట్రాప్ చేసి అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు.

ఆ తర్వాత కేసీఆర్‌ పాలనలో న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు, ప్రతిపక్ష నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు బంగారం నగల వ్యాపారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, సినీ ప్రముఖులు, ఇంకా పలువురి ఫోన్లు ట్యాపింగ్ జరిగాయని ఈ కేసుపై విచారణ జరిపిన సిట్‌ పేర్కొంది.

చివరికి తమ కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారని కేసీఆర్‌ కూతురు కల్వకుంట్ల కవిత స్వయంగా చెప్పుకొని బాధపడ్డారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చక చాలా లోతుగా విచారణ జరిపించి ఈ కేసులో పలువురు మాజీ పోలీస్ అధికారులను అరెస్ట్ చేసింది. అయితే దీంతో తనకు ఎటువంటి సంబందమూ లేదని, ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉంటే దానికి ఆయా అధికారులే బాధ్యులు తప్ప తాను కానే కాదని కేసీఆర్‌ వాదించారు. నేటికీ ఈ కేసు విచారణ నత్తనడకలు నడుస్తూనే ఉంది.

ఈ కేసులో కేసీఆర్‌ని అరెస్ట్ చేయకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుపడుతోందని సిఎం రేవంత్ రెడ్డి పలుమార్లు ఆరోపించారు కూడా.

నాడు తమ హయంలో ఇంత విచ్చలవిడిగా ఫోన్ ట్యాపింగ్‌లు జరిగితే ‘అదంతా భూటకం, రాజకీయ వేధింపులే’ అని ఒక్క ముక్కలో తేల్చిపడేసిన హరీష్‌ రావు, ఇప్పుడు తమ ఫోన్లు హ్యాక్ అవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులను విడిచి పెట్టే ప్రసక్తే లేదని హెచ్చరిస్తున్నారు. తాము చేస్తే సంసారం ఇతరులు చేస్తే వ్యభిచారం అంటే ఇదేనేమో?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Recent Posts

Zero Hype for Dhanush’s Kara in Telugu: What Went Wrong?

Dhanush’s upcoming action-drama Kara is gearing up for a simultaneous Tamil and Telugu release on…

16 minutes ago

వైసీపీ అమరావతి పాఠం…సమస్య ఏదైనా కారణం అమరావతేనా.?

ఎవరైనా ఒక విషయాన్ని పదేపదే ఒక అంశానికే పరిమితం చేస్తూ మాట్లాడుతుంటే వారిని ఆవు పాఠం చెపుతున్నారా అంటూ ఆటపట్టిస్తుంటారు.…

20 minutes ago