
నాని వాయిస్ ఓవర్ తో ప్రారంభమైన ఈ “పిట్టగోడ” టీజర్ తెలుగు సినీ ప్రేక్షకులను అలరించే విధంగా, చాలా సహజత్వంతో నిండుకుని ఉంది. పిట్టగోడపై కూర్చుని ఏదొక సందర్భంలో కబుర్లు చెప్పుకోవడం ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే విషయమే. అలాంటి “పిట్టగోడ” సన్నివేశాల సమాహారమే ఈ సినిమా కధగా కనపడుతోంది. నలుగురు స్నేహితుల పిట్టగోడ సరదా కబుర్లు తెలుసుకోవాలంటే… ఈ “పిట్టగోడ” టీజర్ లో చూపించిన సన్నివేశం చూడాలంతే!
ఈ టీజర్ లో ప్రధానంగా ఆకట్టుకునే అంశం… కమలాకర్ అందించిన నేపధ్య సంగీతం. అలాగే నాని వాయిస్ ఓవర్, డైలాగ్స్. గుర్తింపు లేని నటులను ఎంపిక చేసుకోవడంతో ప్రేక్షకులలో ఎలాంటి అంచనాలు ఏర్పడకుండా ఉండడం కూడా మరో ప్లస్ పాయింట్. చిన్న సినిమాలు భారీ విజయాలు అందుకుంటున్న తరుణంలో ఈ “పిట్టగోడ” కూడా ఆ జాబితాలో చేరుతుందేమో చూడాలి.
Megastar Chiranjeevi’s Vishwambhara is making steady progress on the post-production front, with music director Gaur…
కొండా సురేఖ మంత్రి పదవి నుంచి బర్తరఫ్ కావడం తో ఇక ఎంతో కాలం కొండా కుటుంబం కాంగ్రెస్ పార్టీలో…