ప్రధాని మోడీ @75 నాటవుట్!

PM Modi Turns 75: A Decade of Bold Leadership

నేడు ప్రధాని మోడీ పుట్టినరోజు. నేటితో 74 ఏళ్ళు నిండి 75లోకి అడుగుపెట్టారు. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టి 13 ఏళ్ళుగా దేశాన్ని నడిపిస్తున్నారు.

అయన రాకతో దేశ రాజకీయాలలో, దేశాభివృద్ధిలో పెను మార్పులు మొదలయ్యాయి. బీజేపి నేతృత్వంలో ఎన్డీయేని బలోపేతం చేసి, మళ్ళీ అధికారంలోకి రావాలనే కాంగ్రెస్‌ కలలను కల్లలు చేశారు.

ADVERTISEMENT

పెద్ద నోట్ల రద్దు, లాక్ డవున్, కాశ్మీర్ స్వయంప్రతి రద్దు, ట్రిపుల్ తలాక్ బిల్లు, పాకిస్థాన్‌పై సర్జికల్ స్ట్రైక్, ఆపరేషన్ సింధూర్, అయోధ్యలో రామమందిర నిర్మాణం వంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని అమలుచేశారు.

అలాగే స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి తీవ్ర వివక్షకు గురైన జమ్ము కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలకు రైల్ అండ్ రోడ్ కనెక్టివిటీ, భారీగా మౌలిక సదుపాయాల కల్పిస్తున్నారు.

దేశవ్యాప్తంగా కొత్తగా అనేక జాతీయ రహదారులు, రైల్వే లైన్ల నిర్మాణం, దేశంలో తొలిసారిగా వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళు, తొలి బులెట్ రైలు వంటివన్నీ మోడీ హయంలోనే వస్తున్నాయి.

ప్రధాని మోడీ ‘ఆపరేషన్ సింధూర్’తో భారత్‌ సత్తా ఏమిటో యావత్ ప్రపంచం గుర్తించేలా చేశారు. యావత్ ప్రపంచ దేశాలు కరోనా సమయంలో అల్లడిపోతుంటే భారత్‌ని చెక్కు చెదరకుండా కాపాడుకోవడమే కాకుండా ప్రపంచ దేశాలకు భారత్‌లో తయారు చేసిన కరోనా వాక్సిన్ అందించి సాయపడ్డారు. తద్వారా ప్రపంచ దేశాలలో భారత్‌కు ఎనలేని కీర్తి ప్రతిష్టలు లభించాయి.

మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మళ్ళీ దేశీయ పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేసేందుకు ‘మేకిన్ ఇండియా’ పాలసీని ప్రవేశపెట్టి ఖచ్చితంగా అమలుచేస్తుండటం వలన వివిధ దేశాలకు చెందిన కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెట్టి సెల్ ఫోన్లు మొదలు యుద్ధ విమానాల వరకు తయారు చేస్తున్నాయి. వీటి వలన కోట్లాదిమందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు, పరోక్షంగా ఉపాధి లభిస్తున్నాయి.

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ ప్రధాని మోడీని తక్కువగా అంచనా వేసి భారత్‌పై 50 శాతం సుంకాలు విధించి భారత్‌ని లొంగదీసుకోవాలనుకుంటే ప్రధాని మోడీయే ఆయనకు షాకులు ఇస్తున్నారు.

ప్రధాని మోడీ ఆలోచనలు, విధానాలు, ముఖ్యంగా రాజకీయాలపై ఎన్ని విమర్శలు వస్తున్నప్పటికీ, వాటన్నిటినీ అయన ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకే సాగుతున్నారు తప్ప విమర్శలకు భయపడి ఎన్నడూ వెనక్కు తగ్గలేదు… ఆగిపోలేదు. ఈ వయసులో కూడా చాలా చురుకుగా, చాలా ఉత్సాహంగా పనిచేస్తూనే ఉన్నారు. దేశాన్ని అభివృద్ధి పధంలో నడిపిస్తున్నారు. ప్రధాని మోడీకి పుట్టినరోజు శుభాకాంక్షలు!

ADVERTISEMENT
Latest Stories