మరో వివాదంలో యాంకర్ రవి!

Police case on anchor ravi in sr nagarగతంలో ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమా ఈవెంట్ లో చలపతిరావు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను సమర్ధించారని యాంకర్ రవిపైన చెలరేగిన వివాదం తెలిసిందే. అప్పటినుండి ఈవెంట్లకు కాస్త దూరంగా ఉండడంతో పాటు, వివాదాలకు దూరంగా ఉంటున్న రవి, తాజాగా మరోసారి వార్తల్లోకి ఎక్కాడు.

ADVERTISEMENT

[m9ad]

బాకీ వసూలు కోసం తనను రవి ఫోన్ చేసి బెదిరించారని, అలాగే 20 మందితో కలిసి ఇనుప రాడ్లతో తనపై దాడికి ప్రయత్నించాడని సందీప్ అనే సినీ డిస్ట్రిబ్యూటర్ ఎస్.ఆర్.నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, విచారణ నిమిత్తం యాంకర్ రవిని అదుపులోకి తీసుకుని కేసును దర్యాప్తు చేస్తున్నారు.

యాంకర్ రవి నటించిన “ఇది మా ప్రేమకధ” సినిమాను తానే పంపిణీ చేసానని, అయితే దానికి ఈ వివాదానికి ఎలాంటి సంబంధం లేదని సందీప్ చెప్పిన సంగతులు సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతోంది. ఇటీవల కాలంలో విడుదలైన “యూ టర్న్, ఆటగాళ్ళు” సినిమాలను కూడా సందీప్ పంపిణీ చేసారు.

ADVERTISEMENT
Latest Stories