Telugu

రాజకీయాలలో గజినీలు… బాధితులు కారు ధన్యులు!

గజినీ సినిమాలో హీరో ‘షార్ట్ మెమొరీ లాస్’ అనే వింత వ్యాధితో బాధపడ్డాడు. కానీ అలాంటి వ్యాధి కనిపెట్టి, మెప్పించినందుకు ప్రేక్షక దేవుళ్ళు ఆ సినిమాకి కనక వర్షం కురిపించారు.

మన రాజకీయ నాయకులు కూడా ఇలాంటి ‘షార్ట్ అండ్ లాంగ్ టైమ్‌ మెమొరీ లాస్’ వ్యాధితో బాధపడుతున్నారు. కనుక గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులు గుర్తులేనట్లు, ప్రత్యర్ధులు చేసిన ఆ తప్పుల గురించి గలగలా మాట్లాడేస్తుంటారు.

ADVERTISEMENT

ఉదాహరణకు తెలంగాణలో బీఆర్ఎస్‌ పార్టీ అధికారంలోకి వస్తే నిరుద్యోగ భ్రుతి ఇస్తామని హామీ ఇచ్చి పక్కన పడేసింది. అలాగే కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా హామీ ఇచ్చి పక్కన పడేసింది. కానీ దాని గురించి కేటీఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు…తాము ఆ హామీని అమలుచేయలేదనే విషయం మరిచిపోయి!

కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ముస్లిం ఓట్ల కోసం మజ్లీస్ మీద ఆధారపడవలసి వస్తోందని గ్రహించారు. కనుక ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్స్ ఇచ్చేందుకు శాసనసభలో బిల్ పాస్ చేసి ఢిల్లీకి పంపించి చేతులు దులుపుకున్నారు. ఎన్నికలప్పుడు “మీకు రిజర్వేషన్స్‌ ఇవ్వలనుకున్నాము కానీ కేంద్ర ప్రభుత్వం (బీజేపి) అడ్డుకున్నాయని చెప్పుకునేవారు.

ఆ తర్వాత సిఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో బీసీలను ఆకట్టుకోవడానికి ఏకంగా 42 శాతం రిజర్వేషన్స్‌ ఇవ్వాలని ప్రతిపాదించి, అచ్చం కేసీఆర్‌లాగే శాసనసభలో బిల్లు పాస్ చేసి ఢిల్లీ పోస్టు బాక్సులో పడేసి చేతులు దులుపుకున్నారు. తర్వాత ఆయన కూడా కేసీఆర్‌లాగే బీసీలకు రిజర్వేషన్స్‌ ఇవ్వబోతే కేంద్రం అడ్డుపడిందని చెప్పుకుంటున్నారు.

కానీ పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేయనిదే తమ ప్రతిపాదనలకు మోక్షం లభించదని వారిద్దరికీ ముందే తెలుసు. కానీ ఆయా వర్గాలను ఆకట్టుకోవడం కోసమే ఈ డ్రామాలు నడిపారని కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ పార్టీలే పరస్పరం ఆరోపించుకుంటున్నాయి.

సిఎం రేవంత్ రెడ్డి బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్‌ ఇస్తామని చెప్పి పంచాయితీ ఎన్నికలలో కేవలం 17 శాతం మాత్రమే ఇచ్చి బీసీలను మోసం చేశారని కేటీఆర్‌ విమర్శించారు. అంటే తాము ముస్లింలను మోసం చేసిన సంగతి మరిచినట్లు మాట్లాడుతున్నారన్న మాట!

మాట తప్పుతూ మడమ తిప్పుతూ రాజకీయాలలో మనుగడ సాగించాలంటే ఈ ‘షార్ట్ అండ్ లాంగ్ టైమ్‌ మెమొరీ లాస్’ చాలా అవసరమే అనిపిస్తుంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Indian 3 Back! Can Kamal & Shankar Pull Off a Miracle?

Lyca Productions has finally dropped an update regarding Kamal Haasan's Indian 3, stating that Senapathy…

55 seconds ago

Fake Account On PK, Targeted Lokesh, But Got Arrested

The NDA leadership in Andhra Pradesh has repeatedly raised concerns about alleged attempts to create…

21 minutes ago