కత్తి మహేష్ విసిరిన బాణం… దూసుకుపోతోంది..!

Poonam Kaur Lal controversial tweets director-‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ పై ఇప్పటివరకు చాలామంది చాలా విమర్శలు చేసారు. కానీ అప్పటివరకు ప్రపంచానికి తెలియని మరో విషయాన్ని పూనం కౌర్ రూపంలో బయటపెట్టారు. అయితే ఈ విషయాలు వెలుగుచూసిన కొన్నాళ్ళకు ఇరు వర్గాల మధ్య సెటిల్మెంట్ జరిగిందనే వార్తలు కూడా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

ADVERTISEMENT

ఇందులో నిజానిజాలు ఎలా ఉన్నా… ఇటీవల ప్రముఖ మీడియా ఛానల్ పూనం కౌర్ ను ఇంటర్వ్యూ చేసిన సమయంలోనూ సంచలన విషయాలు బయటకు వస్తాయేమోనని అభిమానులతో పాటు సినీ, పొలిటికల్ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురుచూసాయి. అయితే తాను ఎవరి పేరును ప్రత్యేకంగా ప్రస్తావించను, దైవం, కాలం ఏం చేస్తుందో వాటి కోసం నిరీక్షిస్తుంటాను అని ఒక్క ముక్కలో తేల్చేసింది.

ప్రస్తుతం కూడా పేరును ప్రస్తావించలేదు గానీ, గురువారం రాత్రి సమయంలో పూనం కౌర్ చేసిన ట్వీట్లు నెట్టింట దూసుకుపోతున్నాయి. పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించలేదు గానీ, ఆయన సినిమా పేర్లతో చేసిన ట్వీట్లతో…. వారిద్దరి మధ్య ‘సంథింగ్’ ఏదో ఉందన్న అనుమానాలకు తావిచ్చినట్లయ్యింది. ఈ ట్వీట్ల పరంపర ఆగుతుందో లేక మున్ముందు కూడా కొనసాగుతుందో గానీ, నెటిజన్లకు ప్రస్తుతం పూనం కౌర్ ఓ హాట్ టాపిక్ గా మారింది.

ADVERTISEMENT
Latest Stories