తెలుగు చిత్రపరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ గురించి శ్రీరెడ్డి తన పోరాటాన్ని కొనసాగిస్తూనే వుంది. ఈ నేపథ్యంలో ‘పీకే లవ్’ అలియాస్ పూనమ్ కౌర్ అప్పుడప్పుడు కొన్ని ఆసక్తికరమైన ట్వీట్స్ చేస్తూ, అందరిలోనూ ఆలోచనలు రేకెత్తిస్తోంది. అలాగే తాజాగా ఆమె చేసిన ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది.
ADVERTISEMENT
[m9ad]
“ఇండస్ట్రీలో ఒక డైరెక్టర్ వున్నాడు. సినిమాలనే కాదు .. మనుషులను కూడా డైరెక్ట్ చేస్తుంటాడు. నన్ను కూడా డైరెక్ట్ చేయాలని చూశాడు .. అందులో భాగంగా మాయ చేశాడు కూడా. ఆ విషయంపై వివరణ అడిగితే .. ఏమీ ఎరుగనట్టుగా నటించాడు. ఆయనకి సంబంధించిన అమ్మాయిలే ఇండస్ట్రీలో వుండాలని కోరుకుంటాడు” అని చెప్పుకొచ్చింది.
అయితే ఆ డైరెక్టర్ ఎవరనేది మాత్రం పూనమ్ బయటపెట్టలేదు. దాంతో పూనమ్ ఎవరి గురించి ఇలా మాట్లాడి ఉంటుంది? అనేది ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ గా మారింది.
ADVERTISEMENT



