ఎన్నో పురాణాలను, ఇతిహాసాలను తన చరిత్రలో దాచుకున్న భారతీయ సంస్కృతీ నుంచి ఒక్కో యోధుడి కథను ఈ తరం ప్రేక్షకులకు అందిస్తున్నారు తెలుగు సినిమా దర్శకులు. మొన్న హను MAN తో ప్రశాంత్ వర్మ, నేడు కల్కి తో నాగ అశ్విన్ భారతీయ పురాణాల గురించి ఆలోచించేలా, వాటి గొప్పతనాన్ని తెలుసుకునేలా చేస్తున్నారు.
హను MAN తో హనుమంతుడి సౌర్యాన్ని, ఆయన పరాక్రమాన్ని, ఇచ్చిన మాట కోసం నమ్మిన వ్యక్తి కోసం ఎంత కష్టాన్నైనా, ఎన్ని సముద్రాలైన దాటగలిగిన సూపర్ హీరోగా హనుమంతుడిని ఈ తరం పిల్లలకు పరిచయం చేసారు ప్రశాంత్ వర్మ. హనుమాన్ తో ఒక్క హనుమంతుడి సౌర్యాన్నే కాదు రాముని గొప్పతనాన్ని కూడా తెలుసుకున్నారు.
అలాగే భారీ బడ్జెట్ తో నిర్మించిన కల్కి 2898 AD మూవీ కూడా మన పురాణ గాథల వీరుని చరిత్రలను బయటకు తీసింది. మహాభారతంలో ముఖ్య ఘట్టమైన కురుక్షేత్ర యుద్ధం నేటి రంగుల ప్రపంచానికి ఒక దివ్యాస్త్రంగా మారింది.
అర్జునుడి గాండీవం మొదలుకుని కర్ణుడి వీరత్వం వరకు.., కృష్ణుడి చాణుక్యం నుండి భిష్ముడి పరాక్రమం వరకు అన్నింటిని వెండి తెర మీద ఆవిష్కరిస్తున్నారు నేటితరం టాలీవుడ్ దర్శకులు.
తెలుగు సినిమా స్థాయిని స్థానాన్ని మరో మెట్టు ఎక్కించడానికి పురాణాల చరిత్రను తవ్వుతున్నారు దర్శకులు. సూపర్ హీరోలంటే కల్పిత పాత్రలు కాదని అవి మన పురాణాల నుండే సృష్టించబడిన పాత్రలని తెలియచెప్తున్నారు. కల్కి సినిమాలో కృష్ణుడి గొప్పదాన్ని, అర్జునుడి పరాక్రమాన్ని చెప్పిన నాగ అశ్విన్ కర్ణుడి వీరత్వాన్ని చాటి చెప్పారు.
అర్జునుడు వంటి వీరుడికి, అశ్వద్ధామ వంటి యోధుడికి తన విల్లుతో సమాధానం చెప్పాడు కర్ణుడు అంటూ కర్ణుడిని మరో స్థాయికి తీసుకువెళ్లారు నాగ అశ్విన్. దీనితో కల్కి టాక్ ఆఫ్ ది సినిమా గా కర్ణుడు నిలిచాడనే చెప్పాలి.
అలాగే తెలుగు సినిమా స్థాయిని ఆస్కార్ మెట్టెక్కించిన దర్శక దిగ్గజం రాజమౌళి కూడా తన చివరి చిత్రం మహాభారతమే అవుతుంది అంటూ ప్రకటించి మహాభారతం పై ప్రేక్షకుల అంచనాలను ఆకాశంలో పెట్టారు.
రేపు హనుమాన్ కు సీక్వెల్ గా ప్రశాంత్ వర్మ తెరకెక్కించబోనున్న సినిమాలు కూడా పురాణాలలో సూపర్ హీరోలుగా చరిత్రకెక్కిన వారి కథలే కావడం విశేషం. అలాగే కల్కి నుండి రాబోయే యూనివర్స్ కథలు కూడా పురాణాల ఆధారంగానే తెరకెక్కబోతుంది.




