ప్రభాస్ పక్కన సీతగా ఆమెనా? సరిపోతుందా?

prabhas kiara advaniయంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారారు, అతని తదుపరి చిత్రం… అలాగే బాలీవుడ్ లో అతని మొదటి స్ట్రెయిట్ చిత్రం… ఆదిపురుష్ గత వారం అధికారికంగా ప్రకటించారు. 3 డి టెక్నాలజీ లో వచ్చే ఈ చిత్రం తమిళం, మలయాళం, కన్నడ, మరియు అనేక ఇతర విదేశీ భాషలలో డబ్ చేయబడి భారీ స్థాయిలో విడుదల అవుతుంది.

ADVERTISEMENT

ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ 2021 లో ప్రారంభమవుతుందని, ఈ చిత్రం 2022 లో విడుదలవుతుందని మేకర్స్ ప్రకటించారు. కొద్ది రోజుల క్రితం, ఈ చిత్రంలో కీర్తి సురేష్ మహిళా ప్రధాన పాత్ర పోషిస్తుందని వార్తలు వచ్చాయి. కానీ తనను ఎవరూ ఇప్పటివరకూ సంప్రదించలేదని ఆమె స్పష్టం చేసింది.

రామాయణం ఆధారంగా తీసే ఈ సినిమాలో సీత పాత్రను పోషించడానికి నిర్మాతలు కియారా అద్వానీని సంప్రదించినట్లు ముంబై మీడియా వర్గాల నుండి వస్తున్న సమాచారం. సహజంగా సీత అంటే ప్రసన్న వదనంతో, చాలా హోమ్ లీ లుక్ తో ఉండాలి. కియారా అందుకు సరిపోతుందా అనే సర్వత్రా చర్చ జరుగుతుంది.

గతంలో నయనతార సీత గా చేసింది. అంతకు ముందు అమ్మే ఎన్నో గ్లామర్ పాత్రలు కూడా చేసింది. కాబట్టి ఎవరినీ తక్కువ అంచనా వెయ్యలేం అని కొంత మంది వాదన. కియారా అద్వానీ మహేష్ బాబు, రామ్ చరణ్ సరసన ప్రధాన కథానాయికగా నటించింది మరియు ఆమె ఈ ప్రాజెక్ట్ పై సంతకం చేస్తే ఆమె నటించబోయే మూడవ టాలీవుడ్ స్టార్ ప్రభాస్.

ADVERTISEMENT
Latest Stories