ప్రభాస్ కోసమే ఒక సరస్సు

prabhas movie shooting at annapurna studiosయంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తదుపరి చిత్రం ఓ డియర్ 1960 కాలం నాటి కథతో సినిమా తెరకెక్కుతోంది. యూరోప్ బ్యాక్ డ్రాప్ లో సాగే ప్రేమకథ అంటున్నారు. కొంత భాగం యూరోప్ లో షూట్ చెయ్యగా, అప్పటి పరిస్థితులకు అనుగుణంగా కొన్నిసెట్స్ ఇక్కడ హైదరాబాద్ లో వేసి షూట్ చేస్తున్నారు.

అందులో భాగంగా అన్నపూర్ణ స్టూడియో లో ఒక సరస్సు సెట్ వేశారట. ఈరోజు మొదలైన షెడ్యూల్ లో ఈ సరస్సు దగ్గర కొన్ని కీలక సన్నివేశాలు చిత్రికరించబోతున్నారు. మరోవైపు అదే స్టూడియో లో ఇంకో ట్రైన్ సెట్ కూడా వేశారట. ఆ సెట్ లో తదుపరి షెడ్యూల్ జరుగుతుందని సమాచారం. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్.

ADVERTISEMENT

సాహూ సినిమా లాగానే ఓ డియర్ కూడా రెండో సినిమా డైరెక్టర్ దర్శకత్వం వహించడం గమనార్హం. జిల్ అనే ఫెయిల్యూర్ సినిమా తీసిన రాధాకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సాహూలో ప్రభాస్ హెయిర్ స్టయిల్ గురించి, బరువు గురించి కొంత నెగటివ్ టాక్ వచ్చింది. దీనితో ఆయన బరువు తగ్గి, హెయిర్ స్టయిల్ కూడా మార్చాడు ప్రభాస్.

దసరాకు సినిమా విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. మొన్న ఆ మధ్య ఒక ఇంటర్వ్యూ లో ఈ సినిమాలో ప్రభాస్ రోల్ ఎలా ఉండబోతుందో చెప్పి షాక్ ఇచ్చింది పూజ హెగ్డే. ఇందులో చాలా ఆసక్తికరమైన ట్విస్ట్ లు ఉంటాయని, ప్రభాస్ ను చాలా కొత్తగా కనిపిస్తారని చెప్పింది.

ADVERTISEMENT
Latest Stories