ప్రభాస్ ఫ్యాన్స్ కు ఆలస్యంగా రాబోతున్న సంక్రాంతి

Prabhas on his movie updateమొన్న భోగి, నిన్న సంక్రాంతి, ఈరోజు కనుమ… అయితే ప్రభాస్ అభిమానులకు మాత్రమే రేపే అన్నీ. కారణం వాళ్ళు ఎన్నాళ్లగానో వేచి చూస్తున్న యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తదుపరి చిత్రం అప్డేట్ రేపు రాబోతుంది. ప్రభాస్ రేపు తన పేస్ బుక్ ఖాతా ద్వారా తన లేటెస్ట్ మూవీ గురించి ఒక అప్డేట్ ఇవ్వనున్నారని చిత్ర నిర్మాతలు ప్రకటించారు.

ఈ అప్డేట్ కోసం వారు చాలా కాలం నుండి వేచిచూస్తున్నారు. ప్రభాస్ టీమ్ నుండి జాన్ మూవీ గురించి అసలు ఎటువంటి అధికారిక పోస్టర్స్ గాని, న్యూస్ గాని బయటకు రావడం లేదు. జాన్ అనే టైటిల్ కూడా కేవలం వర్కింగ్ టైటిల్ మాత్రమే. ఇటీవలే సమంత, శర్వానంద్ సినిమాను జాను గా నామకరణం చెయ్యడంతో అది కూడా లేనట్టే.

ADVERTISEMENT

ఎట్టకేలకు రేపు ఈ మూవీపై స్పష్టత రానుంది. 1960 కాలం నాటి కథతో సినిమా తెరకెక్కుతోంది. అంచనాలు భారీగా ఉన్నాయి. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్. ఈ సినిమా కోసం పాతిక వరకూ సెట్స్ హైదరాబాద్ లో నిర్మిస్తున్నారట. ఈ సెట్లు అప్పటి యూరోప్ నగరాలను పోలి ఉంటాయట.

సాహూ సినిమా లాగానే జాన్ కూడా రెండో సినిమా డైరెక్టర్ దర్శకత్వం వహించడం గమనార్హం. జిల్ అనే ఫెయిల్యూర్ సినిమా తీసిన రాధాకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సాహూలో ప్రభాస్ హెయిర్ స్టయిల్ గురించి, బరువు గురించి కొంత నెగటివ్ టాక్ వచ్చింది. దీనితో ఆయన బరువు తగ్గి, హెయిర్ స్టయిల్ కూడా మార్చే ప్రయత్నంలో ఉన్నాడు ప్రభాస్.

ADVERTISEMENT
Latest Stories