ఉగాదికి ప్రభాస్ అభిమానులకు పండగే

prabhas radhe shyamయంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తదుపరి చిత్రం 1960 కాలం నాటి కథతో సినిమా తెరకెక్కుతోంది. యూరోప్ బ్యాక్ డ్రాప్ లో సాగే ప్రేమకథ అంటున్నారు. కొంత భాగం యూరోప్ లో షూట్ చెయ్యగా, అప్పటి పరిస్థితులకు అనుగుణంగా కొన్నిసెట్స్ ఇక్కడ హైదరాబాద్ లో వేసి షూట్ చేస్తున్నారు.

ADVERTISEMENT

ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ఒక సరస్సు సెట్ లో సినిమా షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమాకు ఓ డియర్, రాధే శ్యామ్ అనే టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. మరోవైపు ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ వచ్చే నెల 25న ఉగాది సందర్భంగా విడుదల చెయ్యబోతున్నారని సమాచారం. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్.

సాహూ సినిమా లాగానే ఓ డియర్ కూడా రెండో సినిమా డైరెక్టర్ దర్శకత్వం వహించడం గమనార్హం. జిల్ అనే ఫెయిల్యూర్ సినిమా తీసిన రాధాకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సాహూలో ప్రభాస్ హెయిర్ స్టయిల్ గురించి, బరువు గురించి కొంత నెగటివ్ టాక్ వచ్చింది.

దీనితో ఆయన బరువు తగ్గి, హెయిర్ స్టయిల్ కూడా మార్చాడు ప్రభాస్. దసరాకు సినిమా విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ప్రభాస్ సాహో చిత్రం ఫెయిల్ కావడంతో బాహుబలి తో ఎంతో కష్టపడి సంపాదించుకున్న మార్కెట్ నిలుపుకోవాలంటే ఈ సినిమా హిట్ కొట్టి తీరాలి.

ADVERTISEMENT
Latest Stories