మరో 5 రోజులు ఆగండి… డార్లింగ్ సస్పెన్స్..!

prabhas special surprise to fans on 23rd october‘బాహుబలి 2’ తర్వాత యంగ్ రెబల్ స్టార్ రేంజ్ ఎలా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీంతో ఆ తర్వాత ప్రారంభమైన “సాహో” అప్ డేట్స్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ చిత్ర యూనిట్ నుండి ఏ మాత్రం సమాచారం కూడా లేకపోవడంతో నిరుత్సాహానికి గురవుతున్న అభిమానులకు ప్రభాస్ ఓ తీపికబురును అందించారు.

ADVERTISEMENT

[m9ad]

ఈ దసరా సందర్భంగా “సాహో”కు సంబంధించిన ఏదొక అప్ డేట్ వస్తుందని భావించగా, అందుకు అక్టోబర్ 23వ తేదీన ముహూర్తాన్ని ఖరారు చేసామని ప్రభాస్ స్పష్టం చేసారు. తన పుట్టినరోజు నాడు “సాహో” నుండి ఓ స్పెషల్ వస్తుందని చెప్పడంతో యంగ్ రెబల్ స్టార్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతోంది. ఎన్నాళ్ళో వేచిచూసిన ఉదయం… తమ డార్లింగ్ పుట్టినరోజు కావడం మరింత స్పెషల్ గా మార్చేసింది.

అయితే ఆ ‘స్పెషల్’ ఏమై ఉంటుందా? అన్న కోణంలో రకరకాల చర్చలకు అభిమానులు దారితీసారు. ఫస్ట్ టీజర్ ను విడుదల చేస్తారా? లేక ప్రభాస్ ఫస్ట్ లుక్ ను అందిస్తారా? లేక విడుదల తేదీని అధికారికంగా అనౌన్స్ చేస్తారా? ఇలా ఎవరికీ తోచిన విధంగా వాళ్ళు వేసుకుంటున్న ప్రశ్నలకు జవాబు దొరకాలంటే మరో అయిదు రోజులు ఆగాల్సిందే! పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories