ప్రభాస్ రేంజ్: మూడు నెలల గ్యాప్ లో రెండు 1000 కోట్ల సినిమాలు

Prabhas gears up for Fauzi and Spirit

ప్రభాస్ ఇప్పుడు ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. కేవలం ప్రభాస్ మీద ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ఇంచుమించుగా 5000 వేల కోట్ల రూపాయలు బెట్ కడుతోంది. హీరోగా ప్రభాస్ స్థాయి ఏంటి అనేదానికి ఇది నిదర్శనం. టాక్ తో సంబంధం లేకుండా ప్రతి సినిమాతో రికార్డ్స్ క్రియేట్ చేస్తూ నాన్-ప్రభాస్ రికార్డ్స్ కోసం మిగతా హీరోలు పోటీపడేలా చేసిన ఘనత ప్రభాస్ ది.

రానున్న సినిమా విడుదలలు ప్రభాస్ కెరీర్ కి చాలా కీలకం కానున్నాయి. వచ్చే ఏడాది స్పిరిట్ విడుదలకానున్నట్లు సందీప్ రెడ్డి వంగా ఎప్పుడో కన్ఫర్మ్ చేయగా.. ఇవాళ హను రాఘవపూడి “ఫౌజీ” డేట్ ను డిసెంబర్ 3కి ఫిక్స్ చేసి అఫీషియల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశాడు. 90 రోజుల తేడాతో ప్రభాస్ తన అభిమానుల్ని రెండుసార్లు పలకరించనున్నాడు.

ADVERTISEMENT

ఇదివరకు కూడా ఆదిపురుష్, సలార్, కల్కి సినిమాలు ఆరేడు నెలల గ్యాప్ లో రిలీజ్ అయ్యాయి. ఆదిపురుష్, సలార్ సినిమాలు వెయ్యి కోట్ల మార్క్ ని అందుకోలేకపోయినా.. కల్కి ఆ ఖాళీని పూరించింది.

అయితే.. ఇప్పుడు మూడు నెలల గ్యాప్ లో రిలీజ్ అవ్వబోతున్న “ఫౌజీ, స్పిరిట్” రెండూ 1000 కోట్లు కలెక్ట్ చేసే స్కోప్ ఉన్న సినిమాలు. రెంటికీ మంచి హైప్ ఉంది. హను టేకింగ్ క్లాస్ గా ఉంటే.. సందీప్ సరికొత్త మాస్ యాంగిల్ ని ప్రొజెక్ట్ చేయనున్నాడు. సినిమాలకి ఆ స్కోప్ ఉన్నా.. మూడు నెలల గ్యాప్ లో ఆది సాధ్యమేనా? అనేది ట్రేడ్ పరంగా చూస్తే డౌట్ ఫుల్.

ఒకవేళ ప్రభాస్ రెండు సినిమాలతోనూ 1000 కోట్ల మార్క్ దాటాడంటే మాత్రం.. ఇండియాస్ బిగ్గెస్ట్ హీరో అనే ట్యాగ్ లైన్ ప్రభాస్ కి పర్మనెంట్ గా ఇచ్చేయొచ్చు.

ADVERTISEMENT
Latest Stories