ప్రభాస్ ఫ్యాన్స్… ఇంకెన్నాళ్లు… ఇంకెన్ని సార్లు

Prabhasప్రతి హీరోకి ఫ్యాన్స్ ఉంటారు. ప్రతి ఫ్యాన్ తన హీరో గొప్పగా ఉండాలని, టాప్ స్థానంలో కొనసాగాలని కోరుకుంటారు. ఈ కోవలో తమ హీరో టాప్ అని చెప్పుకోవడానికి కొన్నిసార్లు అవతలి హీరో ఫ్యాన్స్ ని విమర్శించక తప్పని పరిస్థితి. అయితే ఏ హీరో ఫ్యాన్ సంగతి ఎలా ఉన్నా ప్రభాస్ ఫ్యాన్స్ మీద ప్రస్తుతం వేరే హీరోల ఫ్యాన్స్ కూడా జాలిపడే పరిస్థితి. బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ బాగా పెరిగింది. ప్రభాస్ అంటే ఇప్పుడు రీజినల్ హీరో కాదు, ప్యాన్ ఇండియా వైడ్ సూపర్బ్ ఫాలోయింగ్ ఉంది. అయినా కానీ జాలి పడటం ఎందుకో మీరు సినిమా ఫ్యాన్ అయితే ఈజీగా గెస్ చేయొచ్చు.

సెప్టెంబర్ 28 నుండి ప్రభాస్ సలార్ తప్పుకుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. సెప్టెంబర్ 28 అనేది సూపర్బ్ డేట్. వరస సెలవులు ఉన్నాయి. అందుకే హోంబేలె ఫిల్మ్స్ ఆ డేట్ ను చూజ్ చేసుకుంది. కానీ ఇప్పుడు అనివార్య కారణాల వల్ల పోస్ట్ పోన్ చేయక తప్పలేదు. ఇప్పుడు ఆ డేట్ కు ఎవరు వస్తారు అన్నది పక్కనపెడితే సలార్ పై బోలెడన్ని హోప్స్ పెట్టుకున్న ప్రభాస్ ఫ్యాన్స్ కు మరోసారి నిరుత్సాహం తప్పలేదు. ఇప్పుడు సలార్ డిసెంబర్ కు పోస్ట్ పోన్ అని అంటున్నారు.

ADVERTISEMENT

ఇది ఒక్క సలార్ తోనే కాదు. బాహుబలి నుండి అంటే దాదాపు ఎనిమిదేళ్ల నుండి ప్రభాస్ ఫ్యాన్స్ కు ఈ ఇక్కట్లు తప్పట్లేదు. ఒక రిలీజ్ డేట్ పై ఆశలు పెట్టుకోవడం చివరికి ఆ సినిమా వాయిదాలు పడుతూ రావడం.

బాహుబలి 1 అండ్ 2, సాహో, రాధే శ్యామ్, ఆది పురుష్… ఇలా వరసగా అన్ని సినిమాలు కొన్ని సార్లు వాయిదా పడుతూ వచ్చి చివరికి విడుదలయ్యాయి. బాహుబలి తర్వాత ఆ రేంజ్ హిట్ కోసం చూస్తోన్న ప్రభాస్ ఫ్యాన్స్ కు సలార్ ఒక ఆశాకిరణంలా కనిపించింది. కానీ ఇప్పుడు మరికొన్ని నెలల నిరీక్షణ తప్పదు. ఇంతా వెయిట్ చేసాక మొన్న ఆదిపురుష్ లా బ్రేక్ ఈవెన్ అవుద్దో లేదో అనే భయాలు మరో వైపు!

ADVERTISEMENT
Latest Stories