మీరేడిస్తే కన్నీళ్ళు.. నేనేడిస్తే ఉ** కారదు: ప్రసాద్ బెహరా వైరల్ కామెంట్స్

Prasad Behara Viral Comments

కొన్ని మీడియా చానల్ తంబ్ నైల్స్ కొందరు సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ ను ఎఫెక్ట్ చేస్తుండడాన్ని చూస్తూనే వస్తున్నాం. కోటా శ్రీనివాసరావు లాంటి అగ్రస్థాయి నటుడు కూడా “నేను బ్రతికే ఉన్నాను, దయచేసి నన్ను చంపకండి” అంటూ ఆయన మరణించాడని వచ్చిన యూట్యూబ్ న్యూస్ ల మీద ప్రెస్ మీట్ పెట్టి మరీ స్పందించాల్సి వచ్చింది. ఇలా చాలామంది సెలబ్రిటీలు ఇబ్బందిపడిన సందర్భాలు కోకొల్లలు.

రీసెంట్ గా ఈ లిస్టులో ప్రసాద్ బెహరా చేరాడు. కొన్ని నెలల క్రితం కంచన్ అనే ఆర్టిస్ట్ కమ్ ఇన్ఫ్లూయన్సర్ ప్రసాద్ తనను వేధించాడని పోలీస్ కేస్ పెట్టడం, పోలీసులు అతడ్ని అరెస్ట్ చేయడం, ఆ కేస్ నుంచి ప్రసాద్ బయటపడి తన రెగ్యులర్ వర్క్స్ చేసుకోవడం అందరికీ తెలిసిందే.

ADVERTISEMENT

అయితే.. ఇదే విషయాన్ని రీసెంట్ గా ఓ ప్రముఖ ఛానల్ వేరే అమ్మాయి పేరు మరియు ఫోటోతో ఓ న్యూస్ పబ్లిష్ చేసింది. దాంతో ప్రసాద్ ఫ్రెండ్స్ సర్కిల్ లో పెనుదుమారం రేగింది. ప్రసాద్ చాలామందిని రిక్వెస్ట్ చేసుకొని సదరు వీడియో డిలీట్ చేసుకోవాల్సి వచ్చింది

ఈ విషయమై ఇవాళ “పాపం ప్రతాప్” ప్రీరిలీజ్ పంచాయితీ ఈవెంట్లో గట్టిగానే స్పందించాడు ప్రసాద్. నా గురించి ఏమైనా రాసుకోండి, అలా రాస్తే కొన్ని మీకు డబ్బులు వస్తాయి అనుకుంటే ఏమైనా చేసుకోండి. కానీ.. దయచేసి వేరే అమ్మాయిల పేర్లు ఇన్వాల్వ్ చేయకండి.

నేను కూడా మీడియా నుండి ఎదిగినవాడినే. నాగురించి తప్పుగా రాస్తే మా అమ్మ కూడా ఏడవదు, ఎందుకంటే కనీసం ఆమెకి వీడియో ఓపెన్ చేయడం కూడా రాదు. కానీ.. మీ రాతలు నా స్నేహితులని ఎఫెక్ట్ చేయడం బాధాకరం. “మీరు ఏడిస్తే కన్నీళ్లు, నేను ఏడిస్తా ఉచ్చ కారదు” అంటూ ఎమోషనల్ అయిపోయాడు ప్రసాద్ బెహరా.

ఇకపోతే.. డ్యామేజ్ కంట్రోల్ కోసం ఈవెంట్ ను నిర్వహించిన సంస్థ ఆన్లైన్ స్ట్రీమింగ్ లో ఆడియోను మ్యూట్ చేయడం గమనార్హం.

ADVERTISEMENT
Latest Stories