ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిషోర్‌కు చెందిన ఐప్యాక్ బృందం నేటికీ ఏపీలో వైసీపీ కోసం పనిచేస్తూనే ఉంది. త్వరలో జరుగబోయే ఎన్నికలలో వైసీపిని 175/25 సీట్లతో గెలిపించాల్సిన బాధ్యత కూడా దానిపైనే ఉంది కనుక అది కూడా ఆ ప్రయత్నంలోనే ఉంది.
అటువంటప్పుడు ప్రశాంత్ కిషోర్ కూడా జగన్మోహన్ రెడ్డికి, ఆయన ప్రభుత్వానికి మేలు కలిగేలా మాట్లాడతారని, వ్యవహరిస్తాని ఆశించడం సహజమే. కానీ ప్రశాంత్ కిషోర్ ఎప్పుడు మీడియా ముందుకు వెళ్ళినా జగన్మోహన్ రెడ్డిని, ఆయన ప్రభుత్వ విధానాలను తప్పు పడుతూనే ఉన్నారు. ఇటీవల ఉండవల్లిలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్ళి ఆయనతో భేటీ అయ్యారు కూడా.
ఆర్ధిక క్రమశిక్షణ లేకుండా అప్పులు చేసి సంక్షేమ పధకాలు అమలుచేస్తుంటే ఏ రాష్ట్రమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలాగా దివాళా తీస్తుందని ఇదివరకు ఓసారి ప్రశాంత్ కిషోర్ అన్నారు. తాజాగా ప్రముఖ జాతీయ న్యూస్ ఛానల్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నిర్వహించిన ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొనప్పుడు, ఆ మీడియా ప్రతినిధి అనంత్ గోయాంకా ఓ ఆసక్తికరమైన ప్రశ్న వేశారు.
“దేశంలో ఈ పది మంది రాజకీయ నాయకులను స్టాక్ మార్కెట్‌లో స్టాక్స్ అనుకుంటే వీరిలో ఏ ఐదు స్టాక్స్ మీరు కొంటారు?” అంటూ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, ఉదయనిధి స్టాలిన్, అఖిలేశ్ యాదవ్, విద్యా థాక్రే, రాజ్ పాశ్వాన్, రాఘవ్ చద్దా, ఉమర్ అబ్దుల్లా, అభిషేక్ బెనర్జీ పేర్లను చదివి వీరిలో ఐదుగురిని ఎంచుకోమని కోరారు.
దీనికి ప్రశాంత్ కిషోర్ తనదైన శైలిలో జవాబు చెపుతూ, “ఇవన్నీ పాటడ్ ప్లాంట్స్ (కుండీలలో పెంచుకునే మొక్కలు). ఇవన్నీ ఇంకా పెరిగే ‘బ్యాడ్ స్టాక్స్.’ వాటిలో నుంచి నన్ను కొన్ని ‘బ్యాడ్ స్టాక్స్’ ఎంచుకోమంటున్నారు,” అంటూ ప్రశాంత్ కిషోర్ వ్యంగ్యంగా జవాబు చెప్పారు.
ఈ జాబితాలో పేర్కొన్నవారందరూ రాజకీయ వారసులే. అందరూ తండ్రి పేరు చెప్పుకొని పైకి వచ్చినవారే. ఎవరూ వారంతట వారుగా గుర్తింపు సంపాదించుకోలేదు. అందుకే వారందరూ వారి తండ్రులు నాటిన మొక్కలే… అవి కుండీలకే పరిమితం అని ప్రశాంత్ కిషోర్ చెప్తున్నారు.
ఏపీలో ఉన్నది ‘బ్యాడ్ స్టాక్’ అని, ‘మన బంగారం’ మంచిది కాదని ప్రశాంత్ కిషోర్ ఎప్పుడో చెప్పేశారు. కానీ తెలంగాణకు అనేక ఐటి, పరిశ్రమలను తెచ్చిపెట్టి, రాష్ట్రవ్యాప్తంగా మౌలికవసతులు కల్పించి, మంచి సమర్ధుడైన మంత్రిగా, రాజకీయ నాయకుడుగా పేరు సంపాదించుకున్న మాజీ మంత్రి కేటీఆర్‌ని కూడా ప్రశాంత్ కిషోర్ ‘బ్యాడ్ స్టాక్’ అనేయడమే ఆశ్చర్యం కలిగిస్తుంది.
Jagan is a bad stock in Indian Politics
– Prashant Kishor#YSJagan pic.twitter.com/o3EyyWKoBR
— M9 NEWS (@M9News_) February 3, 2024




