ఆ బూతులేంది సామి!

Proddutur YCP Councilors fighting at the meetingవైసీపీ నేతల, మంత్రుల బూతులను ఇప్పటివరకు విన్న ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి నేడు వైసీపీ కౌన్సిలర్లు కూడా తమ టాలెంట్ ను ప్రదర్శించారు. అయితే ఏపీలో ఉన్న అందరి వైసీపీ కౌన్సిలర్లకు వర్తించదు, ప్రొద్దుటూరు వేదికగా జరిగిన కౌన్సిల్ సమావేశంలో వైసీపీ కౌన్సిలర్లు తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించారు.

ఈ కౌన్సిల్ సమావేశంలో రెండు వర్గాల నడుమ తలెత్తిన విభేదాలు, ఏకంగా ఒకరి చెప్పులు మరొకరిపై వేసుకునేటంత వరకు వెళ్లడంతో పాటు, ప్రత్యక్ష ముష్టి యుద్ధాల వరకు సాగింది. డ్యూటీలో ఉన్న పోలీసులు, ఇతర పార్టీ నేతలు ఎంతగా వారించి వెనక్కి తెస్తున్నా, ఆ ఇద్దరు కౌన్సిలర్లు మాత్రం ఎక్కడా ‘తగ్గేదేలే’ అన్న రీతిలో చెలరేగిపోయారు.

ADVERTISEMENT

ఇదంతా వీడియో రికార్డింగ్ జరుగుతోంది, మన పరువే గంగపాలు అవుతుందన్న కనీస జ్ఞానం కూడా లేకుండా ఇద్దరూ ప్రవర్తించడం అధికార వినియోగానికి అద్దం పడుతోంది. ఒకరైతే అసభ్య పదజాలంతో అత్యంత హీనంగా ఎదుటి వారి కుటుంబ సభ్యులను బూతులతో తిట్టడం వీడియోలలో రికార్డ్ అయ్యింది.

రెండు వైసీపీ వర్గాల నడుమ జరిగిన ఈ ఉదంతం సోషల్ మీడియాకు ఎక్కడంతో, ఈ బూతుల, ముష్టి యుద్ధపు వీడియో ఒక రేంజ్ లో వైరల్ అవుతోంది. జగన్ సొంత జిల్లా అయిన కడప జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకోవడం మరో విశేషం. మరి దీనిని పార్టీ అధిష్టానం ఎలా తీసుకుంటుందో, ఎవరి మీద చర్యలు తీసుకుంటుందో లేక ఇదంతా రొటీన్ అని వదిలేస్తుందో వారికే తెలియాలి.

ADVERTISEMENT
Latest Stories