“నిర్మాత” గారు అంత రిస్క్ అవసరమా?

producer anil sunkara next with gopichandటాలీవుడ్ లో మంచి టేస్ట్ ఉన్న నిర్మాతల్లో అనిల్ సుంకర ఒకరు. అయితే దూకుడు లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన అనిల్, ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసుకుంటూ వచ్చారు. ఇక ఈ క్రమంలో చిన్న సినిమాల వైపు ఎక్కువగా ప్లాన్ చేసిన అనిల్, హిట్స్ అండ్ ఫ్లోప్స్ తో సంభంధం లేకుండా ముందుకు సాగుతున్నారు.

అయితే ఇదిలా ఉంటే మరో పక్క తాజాగా టాలీవుడ్ సర్కిల్స్ నుంచి వినిపిస్తున్న కధనం ప్రకారం అనిల్ సుంకర పెద్ద రిస్క్ చేస్తున్నాడు అని తెలుస్తుంది, అదేంటి అంటే, వరుస ఫ్లాప్స్ తో ఉన్న గోపిచంద్ తో సినిమా చెయ్యడమే కాకుండా, ఈ హీరో మార్కెట్ కి మించి అతిగా సినిమా తీస్తున్నట్లు సమాచారం. దాదాపుగా 35 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది అని సమాచారం.

ADVERTISEMENT

అయితే తమిళ దర్శకుడు తిరు చెప్పిన కథ బాగా నచ్చడంతో రిస్క్ అయినా అంత బడ్జెట్ పెట్టడానికి అనిల్ ఒప్పుకున్నట్లు తెలుస్తుంది.

అయితే ఎంత కథ బావున్నా? ఎంత క్రేజీ సబ్జెక్టు అయినా, మరీ హీరో మార్కెట్ ను మించి బడ్జెట్ పెట్టడం అంటే చాలా రిస్క్ తో కూడుకున్న వ్యవహారమే. మరి ఈ వ్యవహారాన్ని అనిల్ ఎలా బాలన్స్ చేస్తారో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories