భీమ్లా ఫ్యాన్స్… ఈ మాట గుర్తు పెట్టుకోండి..!

Producer Naga Vamsi  on Bheemla nayakసంక్రాంతి హంగామాకు సిద్ధమవుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “భీమ్లా నాయక్” సినిమాపై అభిమానులు భారీ అంచనాలనే పెట్టుకున్నారు. ఈ సినిమా విడుదల జనవరి 12వ తేదీనే అంటూ మరోసారి చిత్ర నిర్మాత ఖరారు చేయడం పవన్ ఫ్యాన్స్ కు ఊపునిచ్చే విషయం.

ADVERTISEMENT

అయితే ఒక్క రిలీజ్ డేట్ నే కాదు… ఈ మాటను గుర్తు పెట్టుకోండి… “ఈ సారి కూడా మిస్ అవ్వదు” అంటూ పవన్ కళ్యాణ్ రౌద్రత్వాన్ని ప్రదర్శిస్తున్న ఫోటోను నిర్మాత నాగవంశీ పోస్ట్ చేసారు. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ లో ఉత్సాహం రెట్టింపయ్యింది.

ఇప్పటివరకు రిలీజ్ చేసిన పాటలలో టైటిల్ సాంగ్ ఇన్స్టంట్ బ్లాక్ బస్టర్ కాగా, ‘లాల్ భీమ్లా’ మాస్ వర్గాలకు చేరువ అయ్యింది. అలాగే మెలోడీ ప్రియులను నిత్యామీనన్ సాంగ్ ఆకట్టుకుంటూ అన్ని వర్గాల ప్రేక్షకులను కవర్ చేసింది.

ధియేటిరికల్ ట్రైలర్ ను గనుక సరిగ్గా కట్ చేస్తే… “ఆర్ఆర్ఆర్” తర్వాత ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అందించే సినిమాగా “భీమ్లా నాయక్” నిలుస్తుందని ట్రేడ్ పండితులు లెక్కలు కడుతున్నారు.

ADVERTISEMENT
Latest Stories