హీరోలకు ‘గోల్డెన్’ హ్యాండ్…హీరోయిన్లకు ‘ఐరన్’ హ్యాండ్!

Puri Jagannnadh

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టరుగా ఇండస్ట్రీలో పేరుతెచ్చుకున్న పూరీజగన్నాధ్ డబుల్ ఇస్మార్ట్ తో మరోసారి బాక్స్ ఆఫీస్ వద్ద తన స్టామినా నిరూపించుకోవడానికి రెడీ అయ్యారు. సెంటిమెంట్లను ఎక్కువగా నమ్మే రంగాల్లో సినీ రంగం కూడా ఒకటనే చెప్పాలి.

అటువంటి ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి కష్టం, శ్రమ, అదృష్టంతో పాటుగా కొన్ని సెంటిమెంట్లను కూడా నమ్ముతారు. అయితే ఈ సెంటిమెంట్ ప్రకారం పూరి హీరోల పాలిట గోల్డెన్ హ్యాండ్ గా ముద్ర వేసుకున్నప్పటికి కథానాయికల విషయంలో మాత్రం ఐరన్ హ్యాండ్ గానే మిగిలిపోయారు.

ADVERTISEMENT

పూరి మొదటి సినిమా బద్రి నుంచి తన లేటెస్ట్ మూవీ లైగర్ వరకు చూసుకుంటే ఆయన ఇండస్ట్రీకి ఎంతోమంది నటీమణులను తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం చేసారు. అయితే వారిలో ఒకలిద్దరు మినహా ఏ కథానాయిక కూడా ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేకపోయారు.

బద్రిలో సినీ ఇండస్ట్రీకి రేణుదేశాయ్ ని, టాలీవుడ్ కి అమీషా పటేల్ ను పరిచయం చేసారు. అయితే టాలీవుడ్ లో వీరి కెరియర్ ఏ స్థాయికి వెళ్లిందో అందరికి తెలిసిన విషయమే. అలాగే ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, దేశముదురు, ఇద్దరమ్మాయిలతో, హార్ట్ ఎటాక్ చిత్రాలతో…. తను రాయ్, రక్షిత, హన్సిక, అమలాపాల్, క్యాథెరిన్, ఆదా శర్మ వంటి వారిని తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసారు పూరి.

అయితే వాటిలో కొన్ని సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మ రధం పట్టినా ఆ మూవీలోని హీరోహిన్ గా నటించిన వారికి మాత్రం అనుకున్న స్థాయిలో గుర్తింపు కానీ అలాగే అవకాశాలు రాలేదనే చెప్పాలి. అలాగే నాగార్జున తో తీసిన సూపర్ మూవీ కోసం అయేషా టకియా, లోఫర్ లో దిశా పటాని, బాచి, రోగ్ లో మన్నారా, ఏక్ నిరంజన్ లో కంగనా, నేనింతే, చిరుత లో రాంచరణ్ సరసన నటించిన నేహా శర్మ, ఇజం లో అదితి ఆర్య, లైగర్ లో అనన్య పాండే.

143 లో సమీక్ష, ఇస్మార్ట్ శంకర్ లో నటించిన నిధి అగర్వాల్, నభనటేష్…ఇలా చెప్పుకుంటూపోతే ఎంతో మంది హీరోహీన్స్ గా పూరి చేతుల మీదుగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయినప్పటికీ ఒక్కరు కూడా స్టార్ హోదాను కాదుకదా కనీసం నాలుగైదు సినిమాలతో కూడా ఇండస్ట్రీలో నిలబడలేకపోయారు. అమ్మానాన్న తమిళమ్మాయితో వచ్చిన ఆసిన్, సూపర్ లో సెకండ్ హీరోహిన్ గా వచ్చిన స్వీటీ (అనుష్క) మినహాయిస్తే పూరి తెచ్చిన హీరోహీన్స్ అంత జీరోలుగానే మిగిలిపోయారని చెప్పాలి.

బద్రితో పవన్ ను, ఇడియట్ తో రవితేజను, పోకిరితో మహేష్ ను, చిరుతతో రాంచరణ్ ను,టెంపర్ తో ఎన్టీఆర్ ను,ఇస్మార్ట్ శంకర్ తో రామ్ ను మాస్ హీరోగా నిలబెట్టిన పూరి హీరోల పాలిట దేవుడిలా, హీరోహిన్ ల పాలిట మాత్రం విలన్ గా మిగిలిపోయారనే చెప్పాలి.

ADVERTISEMENT
Latest Stories