ప్రియాంక చోప్రా ‘లిప్ లాక్’తో మళ్ళీ వచ్చేసింది!

Quantico---Reflections-priyanka chopra lip kissingబాలీవుడ్ హాట్ సోయగం ప్రియాంక చోప్రా ‘క్వాంటికో రిటర్న్స్‌’‌లోనూ మునుపటి స్పీడ్ నే కొనసాగిస్తున్నట్లుంది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో వెబ్ మీడియాలో హల్చల్ చేస్తోంది. మాజీ ఎఫ్‌బీఐ ఆఫీసర్‌ జర్నీ ఎలా సాగింది అనే ఆసక్తికరమైన అంశంలో ప్రియాంక చోప్రా అలెక్స్ పారిష్‌గా కనిపించబోతోంది. ఈ ప్రోమోను చూసిన వారంతా ప్రియాంక స్పీడ్ ఏమాత్రం తగ్గలేదనే అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ ప్రోమో వీక్షకుల సంఖ్య దాదాపు 1 మిలియన్ కు చేరుకుంటోంది.

అమెరికన్ టీవీ ఛానల్‌లో ‘క్వాంటికో’ పేరుతో రూపొందుతున్న సిరీస్‌లో ప్రియాంక నటిస్తున్న సంగతి తెల్సిందే! ఎఫ్‌బీఐ ట్రైనర్‌గా తొలుత కనిపించిన ప్రియాంకా అద్భుతమైన అభినయంతో కట్టిపడేసింది. రొమాంటిక్ సీన్స్ లోనూ మోతాదు ఏమీ తగ్గకుండా రెచ్చిపోయింది. ‘క్వాంటికో రిటర్న్స్‌’‌ షో ఈ ఆదివారం నుండి నుంచి మొదలు కానుంది. ప్రపంచంలోని వంద దేశాల్లో ప్రసారం కాబోతున్న ఈ షోను స్పానిష్‌, ఇటాలియన్, జర్మన్‌తోపాటు ఆగ్నేయాసియా ఇలా మొత్తం 44 భాషల్లో అనువాదం చేసినట్టుగా తెలుస్తోంది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories