తన గెటప్ ను చూసి తానే నమ్మలేకపోతున్నాను అంటోంది ‘జూలీ 2’ బ్యూటీ. ఈ స్థాయిలో ఫిట్ నెస్ సాధిస్తానని అనుకోలేదని చెప్తూ బీచ్ ఒడ్డున కూర్చుని ఉన్న ఓ ఫోటోను పోస్ట్ చేసింది రాయ్ లక్ష్మీ. పింక్ టాప్ లో సన్నని నాజూకు నడుముతో కన్నులవిందు చేస్తోన్న ఈ పిక్ సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.
ADVERTISEMENT
ఒకప్పుడు బొద్దుగుమ్మగా మారిన లక్ష్మీ రాయ్ నిజంగానే ఈ జీరో సైజుకు వస్తుందని ఊహించలేదు. కానీ నేటితరం హీరోయిన్లు తాము అనుకున్నది సాధించడానికి ఏ మాత్రం వెనుకాడడం లేదని చెప్పడానికి నిదర్శనమే లక్ష్మీ రాయ్ ఫోటో. హీరోల కంటే మెరుగైన ఫిట్ నెస్ ను సొంతం చేసుకోవడం ఈ జనరేషన్ ముద్దుగుమ్మల స్పెషల్.
ADVERTISEMENT



