
ఒక ఆర్థిక నేరస్తుడికి, నియంత భావజాలం ఉన్న వ్యక్తికీ అధికారం వస్తే, ఉన్నత పదవులలో కుర్చోపెడితే ఏమవుతుందో గత ఐదేళ్లలో ఏపీ అనుభవపూర్వకంగా తెలుసుకుంది. తానూ జైలుకు వెళ్ళొచ్చాను కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్య రాజకీయ నాయకులందరూ కూడా జైలుకు వెళ్లి తీరాల్సిందే అన్నట్టుగా గత ఐదేళ్లల్లో జగన్ తనకు నచ్చని, తనను వ్యతిరేకించిన వారిని జైలుకు సాగనంపారు.
ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ను మొదలుకుని ఆ పార్టీలో ఉన్న ముఖ్య నేతలందరి మీద కేసులు పెట్టడం ఒక శుక్రవారం ఇంటి తలుపులు కొట్టి బలవంతంగా అరెస్టులు చెయ్యడం వైసీపీ ప్రభుత్వంలో సర్వసాధారణ సంఘటనగా మారిపోయింది. తనకు వ్యతిరేకంగా గళం విప్పిన పాపానికి సొంత పార్టీ ఎంపీ RRR ను తెలంగాణ వెళ్లి మరి బలవంతంగా అరెస్టు చేసి అరికాళ్ళ కోటింగ్ ఇచ్చారు.
ఆనాటి నుంచి జగన్ పై అలుపెరుగని యుద్ధమే చేస్తున్నారు రఘురామా రాజు. గత ఐదేళ్ల నిరీక్షణ, ఐదేళ్ల నిస్సహాయతకు ఇక చరమ గీతం పాడడానికి సిద్ధమయ్యారు RRR . వైసీపీ ప్రభుత్వ హయాంలో తనను అక్రంగా అరెస్టు చేసి హింసించిన నేరానికి గాను సునీల్ కుమార్, సీతారామరాజు, జగన్ ల పైన గుంటూరు నగర పాలెం పోలీస్ స్టేటన్ లో కేసు నమోదు చేసారు రఘురామా.
గత ముఖ్యమంత్రి జగన్ ఒత్తిడితోనే 2021 మే 14 న తనను సునీల్ కుమార్ చిత్ర హింసలు పెట్టారని కేసులో పేర్కొన్నారు. తనను శారీరకంగా హింసించి తన పై హత్యాయత్నానికి కూడా పాల్పడ్డారని, ఇదంతా జగన్ కనుసన్నలలోనే జరిగిందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు RRR . ఇందులో భాగంగా సునీల్ కుమార్ ను A 1 గా, సీతారామాంజనేయులు A 2 గా , మాజీ ముఖ్యమంత్రి జగన్ ను A 3 గా FIR లో నమోదు చేసారు.
ఇప్పటికేదాదాపు 32 కేసులను వెనకేసుకున్న జగన్ కూటమి ప్రభుత్వంలో A 3 గా మొదటి కేసును ముందేసుకున్నారు. గత ఐదేళ్ల నుండి కుంటి సాకులు చూపిస్తూ అధికారాన్ని అడ్డుపెట్టుకుని కేసుల విచారణకు హాజరుకాకుండా బెయిలు మీద తప్పించుకుని తిరుగుతున్న జగన్ ఈ కేసును సీరియస్ గా తీసుకుంటారా.? లేక అది తన దినచర్యలో భాగంగా భావిస్తారు.?
జగన్ ను నమ్ముకుని చట్టవ్యతిరేకంగా నడుచుకుంటే ఎదోఒకరోజు చట్టం ముందు దోషిగా నిలబడక తప్పదు అని ఇప్పుడు ఈ అధికారులు మరోసారి రుజువుచేస్తున్నారు. చేతిలో అధికారం ఉంది కదా అని అతి చేస్తే చివరికి అదే అధికారాన్ని కోల్పోయి చట్టం ముందు నేరస్తులుగా తలదించాల్సిందే.
Water is becoming a major political and economic challenge for southern India. Andhra Pradesh, Telangana,…
Ranabaali, starring Vijay Deverakonda and Rashmika Mandanna, is among the upcoming pan-India releases of the…