లేటెస్ట్ : జనవరి 7వ తేదీన “ఆర్ఆర్ఆర్” విడుదల?

Raghu-Rama-Raju iఏది ఏమైనా తాను ఉన్న రాజకీయ పార్టీ వైసీపీని ప్రేమిస్తున్నాను, తాను ఏం చెప్పినా పార్టీపై ఉన్న అభిమానంతో చెప్తాను కానీ, ద్వేషంతో కాదు, అయితే మా ముఖ్యమంత్రి చేస్తోన్న కార్యకలాపాల వలన పార్టీకి చెడ్డ పేరు వస్తుంటే చూసి తట్టుకోలేక, పార్టీ ఎక్కడ నాశనం అయిపోతుందో అనే బాధతో మాట్లాడుతున్నానని చెప్తోన్న రఘురామకృష్ణంరాజు అలియాస్ ఆర్ఆర్ఆర్, ఈ నెల 7వ తేదీన విడుదల కాబోతున్నారా?

శారీరకంగా తనను ఎంతగా హింసించినా పార్టీని వీడకుండా జగన్ మోహన్ రెడ్డికి కొరకరాని కొయ్యగా మారిన ఆర్ఆర్ఆర్, ఈ నెల 7వ తేదీన బీజేపీలోకి చేరబోతున్నారు అంటూ వార్తలు గుప్పుమన్నాయి. గత రెండేళ్లుగా జగన్ ను ఎదిరించి మాట్లాడే వ్యక్తిగా పేరు తెచ్చుకున్న ఆర్ఆర్ఆర్, ఇక వైసీపీకి గుడ్ బై చెప్పి ప్రత్యక్షంగా ఎదురుదాడికి దిగబోతున్నారు అనే టాక్ రాజకీయ వర్గాల్లో ఊపందుకుంది.

ADVERTISEMENT

ఇదే ప్రశ్న తాజాగా ఇచ్చిన ఓ మీడియా ఇంటర్వ్యూలో అడగగా, ప్రస్తుతం పార్టీలోనే ఉన్నాను, ఈ ఇంటర్వ్యూ అయిపోయాక ఒకవేళ పార్టీ తనను ఏమైనా సస్పెండ్ చేస్తే తనకు తెలియదు గానీ, అప్పటివరకు అయితే తాను ఎంతగానో ప్రేమిస్తున్న వైసీపీలోనే ఉండబోతున్నానని తెలిపిన ఆర్ఆర్ఆర్, ‘ఈ నెల 7వ తేదీన ఏదో జరగబోతోంది’ అన్న వ్యాఖ్యలను అయితే కొట్టిపారేయలేదు.

గత వారంలో ఆర్ఆర్ఆర్ పై పలు కేసులు నమోదైన నేపధ్యంలో… రఘురామకు పార్టీ మార్పు అనివార్యం అయ్యిందా? లేక ఇటీవల చంద్రబాబు నోట ముందస్తు ఎన్నికల మాట విన్న బీజేపీ రాష్ట్రంలో ఆర్ఆర్ఆర్ ను ముందు పెట్టి, ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తోందా? ఏమో ప్రస్తుతానికి ఇవన్నీ ప్రశ్నలుగానే ఉన్నాయి గానీ, ఈ నెల 7వ తేదీన కొంతవరకు క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనపడుతోంది.

ADVERTISEMENT
Latest Stories