రాహుల్ గాంధీ ఓటమిలో సెంచరీ కొట్టబోతున్నారా.?

Rahul Gandhi facing criticism over alleged long list of election defeats

కాంగ్రెస్ యువ నాయకుడిగా, ఇందిరా గాంధీ కుటుంబ వారసుడిగా కాంగ్రెస్ పగ్గాలు అందుకున్న రాహుల్ గాంధీ, చేతికి అందివచ్చిన దేశ ప్రధాని హోదాను చేచేతుల జారవిడిచుకుని ఇప్పుడు పదిహేనేళ్లుగా ఆ పదవి కోసం నిరంతరం శ్రమిస్తున్నారు.

ఒక్కో ఓటమిని తన అనుభవంగా మార్చుకుంటూ గెలుపు కోసం పాదయాత్రలు, పోరాట పర్యటనలు చేస్తూనే ఉన్నారు. కానీ ఆ గెలుపు మాత్రం అందని ద్రాక్ష మాదిరి రాహుల్ గాంధీని ఊరిస్తూనే వస్తుంది. మరి రాహుల్ పొందిన అంతటి ఓటమిని ప్రత్యర్థి బీజేపీ ప్రచారం చెయ్యకుండా ఉంటుందా.? రాహుల్ ను అవహేళన గా మాట్లాడకుండా చేస్తుందా.?

ADVERTISEMENT

అవును దాదాపు రెండు దశాబ్దాల నుంచి అంటే 2004 ఎన్నికల నుంచి 2025 బీహార్ ఎన్నికల వరకు రాహుల్ గాంధీ ఖాతాలో సుమారు 95 ఎన్నికల ఓటములు ఉన్నాయని, ఆయన ఓటములతో సెంచరీ చెయ్యనున్నారంటూ బీజేపీ సోషల్ మీడియా వేదికగా రాహుల్ ఓటమి చరిత్ర పై ఒక పోస్ట్ చేసింది.

దీనితో భారతదేశం పై గెలుపు కోసం గజని దండయాత్రల మాదిరి బీజేపీ పై గెలుపు కోసం రాహుల్ దండయాత్రలు అంటూ బీజేపీ మద్దతుదారులు రాహుల్ గాంధీ రాజకీయం పై విమర్శనా బాణాలు సంధిస్తున్నారు.

సెంచరీకి 5 ఓటముల దూరంలో రాహుల్… ఒక ఎన్నిక – ఒక ఓటమి, మరో ఎన్నిక మరో అపజయం…ఇలా రాహుల్ రాజకీయం మొత్తం ఓటమి అనే పద్మ వ్యూహంలో చిక్కుకుని అంతం కావాల్సిందే అన్నట్టుగా బీజేపీ రాహుల్ అపజయాల పై కాంగ్రెస్ ఓటముల పై కౌంటర్లు వేస్తుంది.

ADVERTISEMENT
Latest Stories