రాహుల్‌ గాంధీకి బిజేపి లైన్ క్లియర్ చేసిందా?

Rahul Gandhi INDIA bloc PM face

కాంగ్రెస్‌, బిజేపిలు రాజకీయంగా బద్ధ శత్రువులు. వాటికి వేరే ప్రత్యామ్నాయం లేనందున దేశ ప్రజలు వాటిలో ఏదో ఒక పార్టీ నేతృత్వంలో పనిచేసే కూటమిని ఎన్నుకుంటారు.

అయితే ప్రధానిగా మోడీ, కేంద్ర మంత్రిగా అమిత్ షాలు పగ్గాలు చేపట్టినప్పటి నుంచి క్రమంగా బిజేపి ఒక్కో రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకుంటూ కాషాయ జెండా ఎగురవేస్తుంటే, కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి నానాటికీ దిగజారుతూనే ఉంది. ఎన్డీయేకి ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్న ఇండియా కూటమి కూడా బలహీనపడింది.

ADVERTISEMENT

మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ పార్టీలు, ప్రభుత్వాల పతనం, యూపీ, ఎంపీ, బీహార్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఒడిశా వంటి కీలకమైన రాష్ట్రాలు బిజేపి చేతిలోకి వెళ్ళిపోవడంతో ఇండియా కూటమి ఇంకా బలహీనపడింది.

వాటి మనుగడపైనే కాంగ్రెస్‌ భవిష్యత్‌ కూడా ఆధారపడి ఉంటుంది కనుక ఆ మేరకు అది కూడా బలహీనపడినట్లే భావించవచ్చు. కనుక వచ్చే ఎన్నికలలో బిజేపికి, దాని నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి ఎదురు నిలిచేవారు ఉండకపోవచ్చు.

అయితే ఇండియా కూటమి ఈ బలహీనతే కాంగ్రెస్‌ పార్టీకి కలిసి వచ్చే అవకాశం కావచ్చు. ఇదివరకు ఇండియా కూటమిలో మమతా బెనర్జీతో సహా ఓ అరడజను మంది ప్రధాని అభ్యర్ధులు ఉండేవారు. వారందరినీ బిజేపి రాజకీయంగా దెబ్బ తీసింది.

తద్వారా ఇప్పుడా పార్టీలన్నీ రాహుల్‌ గాంధీని ప్రధాని అభ్యర్ధిగా అంగీకరించక తప్పదు. అంటే ఇండియా కూటమిలో రాహుల్‌ గాంధీకి ఎవరూ పోటీ లేకుండా చేసి బిజేపి మహోపకారం చేసిందని భావించవచ్చు.

దీనిని కాంగ్రెస్‌ అధిష్టానం గుర్తించిందా? సద్వినియోగం చేసుకుంటుందా?అంటే ఢిల్లీ నుంచి ముంబాయి వెళ్ళాల్సి ఉంటుంది. అది వేరే కథ.. కనుక వేరేగా చెప్పుకుందాం.

ADVERTISEMENT
Latest Stories