3.5, 3.25, 3… మా సినిమా రేటింగ్స్..!

Rahul Ravindran requests the Reviewers to give good ratingsరివ్యూల ప్రభావం సినిమాలపై ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ వంటి అగ్ర హీరోలు కూడా బహిరంగంగానే రివ్యూల గురించి మాట్లాడుకునే పరిస్థితి నెలకొంది. అంతటి ప్రాధాన్యత సంపాదించుకున్న రివ్యూల గురించి హీరో కం దర్శకుడిగా మారిన రాహుల్ రవీంద్రన్ ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేసారు.

ADVERTISEMENT

ఈ రోజు విడుదల అవుతోన్న “ఛి||ల||సౌ||” మరియు “గూఢచారి” సినిమాలు నచ్చితే, దానిని వ్యాప్తి చేయండి, అలా చేయడం వలన మాకు మరిన్ని సినిమాలు వస్తాయన్న రాహుల్, “ఛి||ల||సౌ||” దర్శకుడిగా తన మొదటి చిత్రం అని మాత్రం గుర్తు పెట్టుకోమన్నారు. కనుక దయ ఉంచి తమ సినిమాకు 3.5, 3.25, 3కు తక్కువ కాకుండా రేటింగ్స్ ఇవ్వాలని ప్రార్ధిస్తున్నానని ట్వీట్ చేసారు.

రిలీజ్ రోజున వెరైటీగా పబ్లిసిటీ ప్లాన్ చేసినట్లున్నాడు రాహుల్. అందుకే ఎప్పుడూ తమను టార్గెట్ చేసే రివ్యూలను ముందుగానే తాను టార్గెట్ చేస్తూ… ఏకంగా పాయింట్స్ తో సహా ప్రస్తావించారు. అయితే సినిమాకు వెలువడిన ఫస్ట్ టాక్ చిత్ర యూనిట్ కు ఊరటనిచ్చేది కావడంతో, బహుశా రాహుల్ అంచనాలు వేసిన విధంగానే ఉండొచ్చన్నది వీక్షకుల మాట.

ADVERTISEMENT
Latest Stories