Telugu

రెడ్డి గారి ‘గోస వినేటోడు’ లేరా?

తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్ లో ఉండే అంతర్గత రాజకీయ విభేదాలు రచ్చకెక్కిన ప్రతిసారి కాంగ్రెస్ లో ఇంతే… కాంగ్రెస్ లో ఇంతే…అని సరిపెట్టుకోవాల్సిందేనా? ఇండియా కూటమితో దేశ రాజకీయాలను ఏలాలని చూస్తున్న కాంగ్రెస్ అగ్రస్థాయి నాయకులు కనీసం ప్రాంతీయ స్థాయిలో కూడా సొంత అసమ్మతిని కట్టడి చేయలేరా.?

తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి దశాబ్దకాలం పట్టింది. అయితే ఆ వచ్చిన అధికారాన్ని కనీసం 10 నెలలు కూడా సక్రంగా వినియోగించుకోలేకపోయారు టి. కాంగ్రెస్ నేతలు. ముఖ్యంగా సొంత ప్రభుత్వం పై, సొంత పార్టీ ముఖ్యమంత్రి టార్గెట్ గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేస్తున్న విమర్శలు, రాజకీయ ప్రకటనలు నానాటికి హద్దులు దాటుతున్నాయి.

ADVERTISEMENT

అయినా కూడా కాంగ్రెస్ అధిష్టానం నిమ్మకు నీరెత్తినట్టు నిశబ్ధంగా చూస్తూ ఉండిపోతుంది. తాజాగా సీఎం రేవంత్ టార్గెట్ గా రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలోని అంతర్గత విభేదాలకు, వివాదాలకు నిలువెత్తు నిదర్శనం గా కనిపిస్తున్నాయి.

‘ఎదో అదృష్టం కలిసొచ్చి నువ్వు సీఎం అయ్యావు’, ఆంధ్రా కనుసన్నల్లోనే పాలన సాగుతుంది, మూడేళ్లలో ఎవరు సంతోషంగా లేరు, తెలంగాణ అంటే కేవలం సీఎం నియోజవర్గమైన కొండగల్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నియోజకవర్గమైన మధిర మాత్రమేనా?

ప్రభుత్వ నిధులన్నీ కేవలం ఆ రెండు నియోజకవర్గాల అభివృద్ధికే వెచ్చిస్తారా? నాకు మంత్రి పదవి ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ నా నియోజకవర్గమైన మునుగోడుకు నిధులు ఇవ్వరా? వాస్తవాలు మాట్లాడితే పార్టీలో పదవులు రావా? నేను కమిషన్లు తీసుకోను, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయకపోతే యుద్ధం చేస్తాను, వదిలిపెట్టేదిలేదు అంటూ రేవంత్ టార్గెట్ గా రెడ్డి గారు ఒక హాట్ వార్నింగ్ ఇచ్చారు.

అయితే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి కి చెవిలో దూరిగలా తయారైనప్పటికీ ఆయన ‘గోస వినేటోడు’ కాంగ్రెస్ పార్టీలో లేరా? అన్న ప్రశ్న తలెత్తుతుంది. నాటి ఈ చిన్న చిన్న రాజకీయ పొరపాట్లే రేపటి రోజున కాంగ్రెస్ రాజకీయంగా భారీ మూల్యం చెల్లించే పరిస్థితులను తీసుకురావచ్చు.

కాబట్టి కాంగ్రెస్ అధినాయకత్వం కానీ పార్టీ రాష్ట్ర నాయకత్వం కానీ మేలుకోవాల్సిన సమయం ఆసన్నమయినట్టే అనే అభిప్రాయం తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ నుంచి వినిపిస్తుంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Exclusive: Chandrababu Pushes BJP for Simultaneous AP-TS Elections

Andhra Pradesh Chief Minister Chandrababu Naidu has reportedly raised a proposal with the BJP's top…

10 minutes ago

రాహుల్ ‘యాంటీ ఇండియా’ రాజకీయాలు చేస్తున్నారా.?

ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఎంత ముఖ్యమో, ఆ విమర్శల్లో బాధ్యతాయుతమైన వైఖరి కూడా అంతే ముఖ్యం. ప్రభుత్వ…

55 minutes ago