రాజమౌళికి ఆశాభంగం తప్పదా?

Rajamouli baahubali 2  The Conclusion china releaseఇండియన్ మార్కెట్ లో దాదాపుగా 1600 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ను కొల్లగొట్టిన రాజమౌళి “బాహుబలి 2” సినిమాను సెప్టెంబర్ లో చైనాలో విడుదల చేసి, కనివినీ ఎరుగని రికార్డులను కైవసం చేసుకోవాలని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. బయటకు వెల్లడించనప్పటికీ, అమీర్ ఖాన్ “దంగల్” సృష్టించిన కలెక్షన్ల ప్రభంజనం రీత్యా, ‘బాహుబలి 2’ కూడా అదే స్థాయిలో గానీ, అంతకు మించి గానీ వసూలు చేస్తే… ఊహకందని రికార్డులు మన తెలుగు సినిమా సొంతమవుతాయనే స్వార్ధం అందరిలోనూ ఉంది.

ADVERTISEMENT

అయితే ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన అనుమతులు రాకపోవడం విశేషం. చైనాలో రిలీజ్ చేయాల్సిందిగా ఇండియన్ ఫార్మాలిటిస్ అన్ని పూర్తయినప్పటికీ, చైనా ప్రభుత్వం నుండి విడుదలకు గ్రీన్ సిగ్నల్ లభించకపోవడంతో.., అసలు రిలీజ్ అవుతుందా? ఒకవేళ రిలీజ్ అయితే సెప్టెంబర్ లో సాధ్యమేనా? లేక ఇంకాస్త సమయం పడుతుందా? ఇలా దేనిపైన స్పష్టత లేకుండా ఉంది. ‘బాహుబలి 2’ యూనిట్ అయితే ‘దంగల్’ రికార్డులను అధిగమించి, 3000 కోట్ల క్లబ్ లో చేరాలని ఊవ్విళ్ళూరుతోంది.

ఒకవేళ అది సాధ్యం కాకపోయినా… ఓవరాల్ గా (ఇండియా + చైనాలో కలిపి) 2000 కోట్ల క్లబ్ లో చేరడం అయితే గ్యారెంటీ కావడంతో, ‘బాహుబలి 2’ రిలీజ్ కోసం యూనిట్ సభ్యులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతంలో పలు ఇంటర్వ్యూలలో చైనా విడుదల గురించి రాజమౌళి మాట్లాడుతూ… చైనా మార్కెట్ లో స్క్రీన్స్ లభించడం చాలా ముఖ్యమని, ‘బాహుబలి 2’ సినిమాకైతే తగినన్ని స్క్రీన్స్ దొరికినప్పుడే రిలీజ్ చేస్తామని, తన అంచనా ప్రకారం స్క్రీన్స్ లో పెద్దగా ఇబ్బందులు కావని అన్నారు గానీ, ఇలా అనుమతులు లభించడంలో సంక్లిష్టత ఏర్పడుతుందని మాత్రం చెప్పలేదు.

ADVERTISEMENT
Latest Stories