100 లో రాజమౌళి – మరో కలికితురాయి

Rajamouli-On-Times-100-Most-Influential-Listరాజమౌళి కిరీటంలో మరో వజ్రం టైమ్ 100లో చోటు OR టైమ్ 100 లో రాజమౌళి – మరో కలికితురాయి

ఆర్ఆర్ఆర్ గురించి ఎవరెంత శోకాలు పెట్టినా , రాజమౌళి ఘనత గురించి ఎన్ని దీర్ఘాలు పెట్టినా ఆయన కిరీటంలో మరో కలికితురాయి వచ్చి చేరింది. ప్రపంచంలో అత్యంత ప్రామాణికత కలిగిన మీడియా సంస్థగా పేరున్న టైమ్ పత్రిక ప్రతి ఏడాది ప్రపంచంలో అత్యంత ప్రభావం చూపించిన మొదటి వంద మంది జాబితాను విడుదల చేస్తుంది. అందులో చోటు దక్కించుకోవడం అంటే గొప్ప ఘనత

ADVERTISEMENT

పయోనీర్స్ విభాగంలో ఎస్ఎస్ రాజమౌళి పేరు సగర్వంగా చేరుకుంది. చాలా లోతైన అధ్యయనం, విపరీతమైన వడబోత తర్వాత ఈ లిస్టు తయారవుతుంది. ఒకరకంగా చెప్పాలంటే దీన్ని ఆస్కార్ స్థాయి గుర్తింపు భావిస్తారు సెలెబ్రిటీలు. సామ్ ఆల్ట్ మెన్, ఎడ్వర్డ్ రేనాల్డ్స్, రాబిన్ జెంగ్, సామ్ రివెరా, మార్గరెట్ మిచెల్ తదితరుల సరసన ఒకే ఒక్క భారతీయ పేరుగా జక్కన్న మరోసారి గర్వకారణంగా నిలిచారు.

గత ఏడాదికి పైగా ఆర్ఆర్ఆర్ సృష్టించిన సంచలనం ఈ విజయానికి కారణంగా నిలిచింది. అకాడెమి అవార్డులకు నామినేషన్ దక్కించుకోవడం, గోల్డెన్ గ్లొబ్ అవార్డుల్లో విజేతగా నిలవడం, స్టీవెన్ స్పీల్బర్గ్ జేమ్స్ క్యామరూన్ లాంటి దిగ్గజాలు స్వయానా మెచ్చుకోవడం రాజమౌళి వైపు వరల్డ్ మీడియా చూసేలా చేసింది. యుఎస్ నుంచి జపాన్ దాకా ట్రిపులార్ అందుకున్న ఖ్యాతి ఖండాంతరాలు దాటింది

ఒక ఇండియన్ ఫిలిం మేకర్ కు ఇలాంటి గౌరవం దక్కడం అరుదు. ప్రముఖ బహుముఖ ప్రజ్ఞాశాలి పద్మా లక్ష్మి సైతం చోటు దక్కించుకున్నారు కానీ ఆవిడ ఇండో అమెరికన్ కాబట్టి పూర్తి భారతీయతను ఆపాదించలేం. అయినా ఒక తెలుగువాడు తెలుగు సినిమా తీసి టాలీవుడ్ కీర్తి పతాకను ఇలా పదే పదే అంతర్జాతీయ వీధుల్లో ఎగరేయడం కన్నా టాలీవుడ్ కు గర్వకారణం ఇంకేముంటుంది.

ADVERTISEMENT
Latest Stories